Andhra Pradesh

News July 25, 2024

విశాఖ: స్పీకర్‌ పై 17, హోంమంత్రిపై 6 కేసులు

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో TDP నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రునిపై అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. హోంమంత్రి అనితపై 06 కేసులు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడిపై 04, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ పై 03 కేసులు పెట్టారని చెప్పారు.

News July 25, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ MLAలపై ఎన్ని కేసులంటే.!

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో CM చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత MLAలపై YCP ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం కొల్లు రవీంద్ర 15, బొండా ఉమా 12, యార్లగడ్డ వెంకట్రావు 7, కొలికపూడి శ్రీనివాసరావు 8, మాజీ MLC బుద్ధా వెంకన్నపై 3 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమపై అత్యధికంగా 27కేసులు పెట్టి ఒకసారి అరెస్ట్ చేశారు.

News July 25, 2024

నెల్లూరు జిల్లాలో దొంగతనాలపై అసెంబ్లీలో ప్రస్తావన

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈక్రమంలో దేవాలయాలపై దాడులు అనే అంశంలో నెల్లూరు జిల్లా దేవాలయాల్లో జరిగిన దొంగతనాలను ఆయన ప్రస్తావించారు. ‘వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీకి గురైంది. అలాగే చేజర్ల మండలం శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది’ అని చంద్రబాబు చెప్పారు.

News July 25, 2024

మచిలీపట్నం: విమానాశ్రయం విస్తరణ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరంలో విమానాశ్రయ విస్తరణలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, భూముల నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించారు. అధికారులు మాట్లాడుతూ.. విమానాశ్రయం ప్రహారీ లోపల విద్యుత్ స్తంభాలు తొలగింపు పూర్తయిందన్నారు.

News July 25, 2024

ఏయూ: ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామన్నారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారు.

News July 25, 2024

కొడవలూరు ఆటోస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం

image

కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని ఆటోస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహన్ని గురువారం వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. గుళికలు కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News July 25, 2024

ఏలూరు: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

image

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి గురువారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మండలాల్లోని అధికారులు, సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 25, 2024

గన్ మెన్లను తిరస్కరించిన కడప ఎమ్మెల్యే

image

తనకు కనీస సమాచారం ఇవ్వకుండా 2+2 గన్ మెన్లను 1+1కు కుదించడంపై కడప ఎమ్మెల్యే మాదవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పైగా తన భర్త శ్రీనివాసులురెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటూ వారిని పంపించేశారు. సెక్యూరిటీని కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఖండించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లారు.

News July 25, 2024

తిరుపతి : PG ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చిలో PG M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News July 25, 2024

అరకు: విధుల్లో గుండెపోటు.. కండక్టర్ మృతి

image

పాడేరు డిపోకు చెందిన కండక్టర్ పీ‌ఎస్‌ఎస్ నారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం పాడేరు నుంచి అరకులోయకు వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ నారాయణకు గుండెపోటు వచ్చింది. అదే బస్సులో అరకులోయ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ అరకులోయ ఆసుపత్రికి చేరుకున్నారు. తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.