India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొరియా దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వాళ్లకి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులు బుధవారం చివరి గడువు అని ఐటీఐ ప్రవేశాల కన్వీనర్ నాగేశ్వరరావు తెలియజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఆ ప్రింట్ కాపీలను తాము చేయదలుచుకున్న కళాశాలలో ఈ నెల 25లోగా ఒంగోలులోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై మధుసూదనరావు తెలియజేశారు. ఉమామహేశ్వరరావుకు నరసన్నపేట సీఐ ప్రసాదరావు, ఎస్సై అశోక్ బాబు సంతాపం తెలిపారు.

జి.కొండూరు మండలం చిన్న నందిగామకి చెందిన ఉప సర్పంచ్ బలుసు స్వామి (59) మంగళవారం చేపల వేటకు చెరువులోకి దిగి <<13690723>>ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.<<>> కాగా ఇటీవలే స్వామి పెద్దకుమారుడు మురళి(30) మైలవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. మురళి మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబం నెలలోనే స్వామి మరణవార్తతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కాగా గ్రామపంచాయితీ ఉపసర్పంచ్‌గా స్వామి ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలతో కూటమి ప్రభుత్వం దమన కాండ చేస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీలో నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వారి వెంట నెక్కల నాయుడు బాబు, కేవీ సూర్యనారాయణ రాజు ఉన్నారు.

భారీ వర్షాలు.. వరదల వేళ విధుల్లో అలసత్వం వహించి గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి కారణమైన డ్రెయిన్ల శాఖ ఈఈ MVV కిషోర్‌ను ప.గో కలెక్టర్ సి.నాగరాణి మంగళవారం సస్పెండ్ చేశారు. పాలకోడెరు మండలం మోగల్లు వద్ద గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి ఈఈ పర్యవేక్షణ లోపం, సరైన ముందస్తు చర్యలు లేకుండా బాధ్యతా రాహిత్యంతో ఉండటమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.

కూరగాయల సాగు క్లస్టర్ల ఏర్పాటుపైనా కేంద్రం ప్రకటన చేసింది. ఐతే నారాకోడూరు, మంగళగిరి, బెల్లంకొండ, వినుకొండ, దుగ్గిరాల, కొల్లిపర, బాపట్ల, కర్లపాలెం తదితర ప్రాంతాలకు ప్రోత్సాహం లభించనుంది. దీనివల్ల కూరగాయల సాగుదారులకు లబ్ధి కలగడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రూ.30 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈమేరకు తీర్పు ఇచ్చారు. ఎన్నికల సమయంలో చాపాడు పోలీసులు తనపై నమోదు చేసిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రఘురామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.5 లక్షల చొప్పున నష్ఠపరిహారాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC)కు కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాకు విస్తృత ప్రయోజనం కలగనుంది. సుమారు 800 కి.మీ మేర నిర్మించనున్న ఈ కారిడార్ జిల్లాలోని కంకిపాడు, గన్నవరం, మచిలీపట్నం మీదుగా వెళ్లనుంది. ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు మంజూరైన నేపథ్యంలో.. ఆయా పనులు ప్రారంభమైతే జిల్లా రూపురేఖలు మారతాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.