Andhra Pradesh

News April 30, 2024

అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు కలెక్టర్ ఎం.హరినారాయణన్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల వద్ద పక్కాగా తనిఖీలు చేయాలని సూచించారు.

News April 30, 2024

పలాసలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

మండలంలోని బ్రాహ్మణతర్ల- కేదారిపురం గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన పొలంలో మంగళవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎండకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెక్కలిలోనూ మరో వ్యక్తి వడ దెబ్బతో మృతి చెందారు. స్థానికులు చుట్టు పక్కల గ్రామస్థులకు సమాచారం అందించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కుటుంబ సభ్యులకు తెలపాలని కోరారు.

News April 30, 2024

చెంగాళమ్మను విస్మరిస్తే పదవి గల్లంతే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ దర్శనానికి వెళ్లకుండా ఉంటే పదవి పోతుందనే నమ్మకం ఉంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆలయం దారిగుండా కారులో వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. మరో ప్రధాని ఐకే గుజ్రాల్ శ్రీహరికోటకు వచ్చినా అమ్మవారిని దర్శించుకోలేదు. 1998లో ఆయన పదవిని కోల్పోయారు. తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్‌కు కూడా ఇలాగే పదవీగండం కలిగిందని స్థానికులు చెబుతారు.

News April 30, 2024

తిరుపతిలో 46 మంది పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోనే అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది పోటీ చేస్తున్నారని రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ప్రకటించారు. YCP నుంచి భూమన అభినయ్ రెడ్డి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. సీపీఐ నుంచి మురళి పోటీ చేస్తున్నారు. చంద్రగిరిలో 24 మంది, అత్యల్పంగా నగరిలో 7 మంది బరిలో ఉన్నారు.

News April 30, 2024

గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి

image

మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో ఈతకెళ్లి ఒంగోలుకు చెందిన ఆటోడ్రైవర్ గొరిపర్తి సాంబశివరావు (35) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి గుండ్లకమ్మ జలాశయంలో ఈత కొట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సోమవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రమేశ్ చెప్పారు.

News April 30, 2024

ఏలూరు: ఘోరం.. ACCIDENTలో తండ్రి, కూతురు మృతి

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనగా ఘటన స్థలంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దుర్గ గుడిని దర్శించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

కోటబొమ్మాళి: టీడీపీలో చేరిన వాలంటీర్లు

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల వాలంటీర్ విధులకు రాజీనామా చేసిన 17 మంది అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ.. నెలకు రూ. 5 వేలు భృతితో నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న తమ వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలు రాయించుకున్నారని వాపోయారు.

News April 30, 2024

మహానంది: ఎండలకు అల్లాడుతున్న ప్రజలు

image

మహానంది మండలంలో గాజులపల్లె గ్రామంలో ఎండలకు తట్టుకోలేక పూరిళ్లలో నివసిస్తున్న వారు నీటితో ఇంటి పైకప్పుపై నీళ్లు చల్లుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉక్కపోత ఎక్కువగా ఉండటం, ఎండాకాలంలో చిన్న నిప్పురవ్వపడితే ఉండే ఇళ్లు కూడా కాలిపోతుందనే భయంతో ఇంటిపై నీళ్లు చల్లుకుంటున్నామని తెలిపారు. సూర్యతాపానికి నిలువుటద్దంగా ఈ ఫొటో నిలుస్తుందని పేర్కొంటున్నారు.

News April 30, 2024

నేటి నుంచి హుబ్లీ-గుంతకల్ ప్యాసింజర్ రైలు పాక్షికంగా రద్దు

image

గుంతకల్ రైల్వే డివిజన్‌లోని హుబ్లీ-గుంతకల్ ప్రధాన రైలు మార్గంలో జరుగుతున్న పనుల కారణంగా ఈ మార్గంలో తిరిగే ప్యాసింజర్ రైలు సర్వీసులను మంగళవారం నుంచి పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు హుబ్లీ-తోర్నకల్ మధ్య మాత్రమే ప్యాసింజర్ రైలు తిరుగుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News April 30, 2024

టీడీపీ నుంచి ముడియం సూర్యచంద్రరావు సస్పెండ్

image

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు, ముడియం సూర్యచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ముడియం సూర్యచంద్రరావు టీడీపీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.