Andhra Pradesh

News April 29, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ

image

జిల్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా జాతీయ ఉర్దూ యూనివర్సిటీని ఎంపిక చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప శివారులోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న మౌలానా అబుల్ కలాం జాతీయ ఉర్దూ యూనివర్సిటీ(MAANU)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎంపిక చేసామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.

News April 29, 2024

పవన్ మండపేట పర్యటన తాత్కాలికంగా వాయిదా

image

ఏప్రిల్ 30వ తేదిన ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా మండపేట నియోజకవర్గంలో జరగాల్సిన వారాహి విజయభేరి బహిరంగ సభ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని కూటమి శ్రేణులు గమనించాలని, ఇదే వారంలో తిరిగి పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పేర్కొంది. తేదీ ఖరారు కాగానే వివరాలు తెలియజేస్తామని నాయకులు తెలిపారు.

News April 29, 2024

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: శ్రీభరత్

image

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో అంబేద్కర్ కళాక్షేత్రం ఎస్సీ, ఎస్టీ సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లదని చెప్పారు.

News April 29, 2024

బాలయ్య రాకతో జనసంద్రమైన చిత్తూరు గాంధీ సర్కిల్

image

స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా చిత్తూరుకు విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చిత్తూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాలయ్య రాకతో చిత్తూరు గాంధీ సర్కిల్ జనసంద్రమైంది. బాలయ్య మాట్లాడుతూ..  సైకో జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదని,  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మంచి చేకూరుతుందని అన్నారు.

News April 29, 2024

జిల్లాలో పులివెందుల టాప్.. బరిలో 27 మంది

image

కడప జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో పులివెందుల టాప్‌లో నిలిచింది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా, 10 నామినేషన్లు తిరస్కరించామని, 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు. దీంతో 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. దీంతో సీఎం జగన్ పై ఇక్కడ 26 మంది పోటీ పడుతున్నారు.

News April 29, 2024

అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నమోదు చేస్తాం:శేఖర్ విద్యార్థి

image

పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును వారి రిజిస్టర్ లతో సంబంధం లేకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు తమ రిజిస్టర్లలో పక్కగా నమోదు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. ఏజెంట్లతో కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మన జిలాని సమూన్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రతి ఒక్కరు లావాదేవీలను తెలపాలన్నారు.

News April 29, 2024

గ్లాసు గుర్తు పొందిన పసుపులేటి సుధాకర్

image

కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో పసుపులేటి సుధాకర్ అనుచరులు ఆనంద ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ సింబల్‌ను తమకు కేటాయించాలని కోరుకున్నారు.

News April 29, 2024

విశాఖపట్నం పార్లమెంటుకు 33 మంది పోటీ

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 33 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. పరిశీలనలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, సోమవారం వరకు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. గుర్తింపు పొందిన ప్రధాన పార్టీలకు చెందిన వారు నలుగురు, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 14 మంది, 15 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారని చెప్పారు.

News April 29, 2024

విజయనగరం: పసికందు మృతదేహం కలకలం

image

మెంటాడ మండలం ఆండ్రలో సోమవారం చంపావతి బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందును పడేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దర్యాప్తు చేసి పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఆండ్ర సబ్ ఇన్‌స్పెక్టర్ బొడ్డు దేవి చెప్పారు. తదుపరి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

News April 29, 2024

కుమార్తె సమక్షంలో టీడీపీలో చేరిన తల్లి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి వార్డు మెంబర్ కృష్ణవేణి టీడీపీలో చేరారు. ఆమె వార్డు మెంబర్‌గా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె శిరీషాదేవి రంపచోడవరం ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో శిరీష తన తల్లికి స్వయంగా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమార్తె విజయానికి ప్రచారం చేస్తానని కృష్ణవేణి అన్నారు.