India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TDP ఆవిర్భావం నుంచి NTR కష్టసుఖాలలో వెంట నడిచిన నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈయన రాజమండ్రి, రూరల్ నుంచి MLA అభ్యర్థిగా 9సార్లు బరిలో నిలిచి, 6సార్లు (1983, 85, 1994, 99, 2014, 19) గెలిచారు. రూరల్‌లో 2014, 19 ఎన్నికలలో వరుసగా గెలిచిన గోరంట్ల.. ఈసారి వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుతో తలపడుతున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని గోరంట్ల.. గోరంట్లకు కళ్లెం వేయాలని వేణు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కర్నూలు ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని ఆమె పేర్కొన్నారు. జిల్లాల్లో మొత్తం 20,30,377 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 10,01,971, స్త్రీలు 10,28,096 మంది కాగ, ఇతరులు 310 ఉన్నారు. ఇప్పటికి ఓటరు జాబితాలో పేరు లేని వాళ్ళు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెంగళరావ్ నగర్ -2 వార్డు సచివాలయ పరిధి వాలంటీర్ జె. శ్రీనివాసులును విధుల నుంచి తొలగిస్తూ రిటర్నింగ్ అధికారి/నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లబ్దిదారుల వివరాలను అందజేస్తూ, ఇతర వాలంటీర్లను కూడా వివరాలు అందించాలని ప్రేరేపించే సందేశాలను పంపిస్తున్నందున వాలంటీర్‌ను విధుల నుంచి తప్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం ఒక తెలిపారు. మొత్తం 29,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,662 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 446 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులు హాజరు కావాల్సిన 8వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) ప్రాక్టికల్/ వైవా పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మార్చి 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలన్నాయి.
గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటర్లు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కి నివేదిక అందించారు. ఎన్నికల అధికారి జయరాం వాలంటీర్స్ ఓంకార విజయలక్ష్మి, సింగంపల్లి భవానీలను తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న వాలంటీర్స్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.
‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.
పెదకూరపాడు గ్రామ 3వ సచివాలయం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏటుకూరి గోపిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో జరిగిన TDP విస్తృతస్థాయి సమావేశంలో ఇతను భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారి కందుల శ్రీరాములు వాలంటీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో మల్లేశ్వరికి ఉత్తర్వులు జారీ చేశారు.
భీమవరం రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై పీటీవీ రమణ తెలిపారు. సుమారు 45 ఏళ్లు కలిగిన మహిళ.. నీలం రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 70939 39777 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.