India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టెక్కలి సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఈసీఈ) 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వర్షప్రియకు చోటుదక్కింది. ఈ మేరకు కళాశాల యాజమాన్యం శనివారం వివరాలు వెల్లడించింది. 17.15 నిమిషాలలో పెన్సిల్ కొన మీద 26 అక్షరాలు చెక్కినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు తెలిపారు. యువతిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20 రోజులు దాటిన అంగన్వాడీలకు ఇప్పటికీ కందిపప్పు సరఫరా జరగలేదు. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు పరిధిలో 2934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రేషన్ ద్వారా బియ్యం, కందిపప్పు నూనె సరఫరా జరుగుతుంది. కానీ ఈనెల 20వ తేదీ దాటినప్పటికీ కందిపప్పు సరఫరా చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో పలు చోట్ల కార్యకర్తలతో గొడవలకు దిగుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు ఉన్నా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ వైద్యాధికారులును ప్రశ్నించారు. శనివారం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన కేసుల్లో వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. నమ్మకం కలిగించేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవకన్నారు.

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఓ యువకుడిపై కేసు నమోదుచేసినట్లు SI రాజేశ్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాలు.. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన యువకుడు వెంకటరమణ మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి కొంతకాలం క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల బాలికను విలస గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటినుంచి శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసిందన్నారు.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భద్రత మరింత కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆయనకు 4 + 4 భద్రత కొనసాగింది. ఆ తర్వాత 2+2 గన్‌మెన్లకు ప్రభుత్వం తగ్గించింది. ఇదే విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉంది. పుంగనూరు అల్లర్ల తర్వాత ఆయన భద్రతను 1+1కు కుదించారని.. దాడుల తర్వాత సెక్యూరిటీ పెంచాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

బొబ్బొలిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DSP శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీలో ఇద్దరి కుమార్తెలతో నివాసముంటున్న తండ్రి శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో 11 ఏళ్ల కూతురిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాలిక అమ్మమ్మ స్థానికుల సాయంతో తమను ఆశ్రయించగా దర్యాప్తు చేశామన్నారు. బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించి, నిందుతుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ కేసులో దర్గామిట్ట పోలీసులు విచారణ చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన డి.హరిత, వికాస్ మరమ్మత్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. వికాస్ మరమత్ ఫిర్యాదు మేరకు నగర మేయర్ భర్త పి.జయవర్ధన్, ఆయన అసిస్టెంట్ శివకృష్ణ, కార్తీక్ మాలవ్య, స్ట్రక్చరల్ ఇంజినీర్ అండ్ లైసెన్స్డ్ దిలీప్ కమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని చిన్నారులు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాలు..<<13666450>>గుమ్మగట్ట<<>>(M) ఎస్.హొసళ్లికి చెందిన మల్లికార్జున కుమారుడు అరుణతేజ, మల్లేశ్ కుమార్తే స్పందన.. వీరిద్దరూ అన్నదమ్ములు. చిన్నారులను రాయదుర్గం పాఠశాలకు మామ సురేశ్ బైక్‌పై తీసుకెళుతుండగా వేగంగా వచ్చి ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణతేజ అక్కడికక్కడే మృతిచెందగా, స్పందన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

కర్నూలు: జోన్-4(కర్నూలు, అనంతపురం రేంజ్) పరిధిలో 52మంది ఎస్సైలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వీరిని నియమించామని ప్రస్తుతం ఎన్నికలు ఎలక్షన్ కోడ్ ముగియడంతో వారివారి స్థానాలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు

జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సీతారాంపురం మండలంలో 40.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అదేవిధంగా ఉదయగిరిలో 18.0, దుత్తలూరులో 17.6, కందుకూరులో 16.8, కొండాపురంలో 12.3, కావలిలో 9.6, సంగంలో 9.0, మర్రిపాడులో 7.8, నెల్లూరు రూరల్ 7.4, బోగోలులో 7.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.
Sorry, no posts matched your criteria.