India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గంలో వేర్వేరు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన భార్యాభర్తలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. 1967లో కట్రెడ్డి కుసుమేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోకరాజు రంగరాజుపై 3997 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 1970లో జరిగిన ఉప ఎన్నికలో కట్రెడ్డి భార్య ఆండాళ్ళమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు.
చంద్రబాబు ఆదివారం కౌతాళపురంలో ప్రజాగళం సభను నిర్వహించారు. అందులో మంత్రాలయం, ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇసుక దోపిడీదారులని, ప్రజల రక్తాన్ని పీల్చే వ్యక్తులని, రోడ్డు, నీరు, అభివృద్ధి చేయలేని అసమర్ధులని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను, కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?
TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, చక్రాల కుర్చీకి పరిమితమైన వారు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను ఇంటింటికి సచివాలయం సిబ్బంది 1వ తారీఖు నుంచి అందిస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన వారికి DBT విధానం ద్వారా వారి వారి అకౌంట్స్‌లోనికి మే 1వ తారీఖున పెన్షన్ జమ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ తీసుకోవడానికి ఎవ్వరూ కూడా సచివాలయం లేదా ఏ ఇతర ఆఫీస్‌లకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు.
దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు ఆస్తి తగాదాలతో రాజా వెంకటేష్(32) అనే యువకుడిని చిన్నమ్మ కూతురు భర్త బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ కూతురుపై దాడికి యత్నించడంతో వెంకటేష్ అడ్డు రావడంతో కత్తులతో పొడిచి పరారయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో తుది ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 20,12,373 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈనెల 21వ తేదీకి తుది ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరందరికీ మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇక కొత్తగా ఓటర్లను నమోదు చేయడం, తొలగింపు, దిద్దుబాటుకు అవకాశం లేదు.
అనంతపురం జిల్లాలోని కొండేపల్లిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కటే గ్రామం అయినప్పటి శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఉండటం విశేషం. దీంతో ఆ ఊరి ఓటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకొంటారు. 2009కి ముందు గ్రామస్థులు ఇద్దరు ఎంపీలను ఎన్నుకునేవారు. పుట్లూరు మండల పరిధిలోని ఓటర్లు హిందూపురం లోక్ సభ, ధర్మవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉండేవారు. పునర్విభజన అనంతరం వీరిని శింగనమల నియోజకవర్గంలోకి తెచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్లు ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్నది. పార్లమెంటు అసెంబ్లీ పరిధిలో ఎంతమంది నామినేషన్లు ఉప సంహరించుకుంటారో సర్వత్ర ఆసక్తిగా మారింది. తమ పేరును పోలి ఉన్న అభ్యర్థులతో ప్రధాన రాజకీయ పార్టీలు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చర్చలు జరుపుతున్నారు. ఉపసంహరించుకున్న అభ్యర్థులకు భారీ ఎత్తున నగదు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సిద్దవటం మండలంలో వడదెబ్బకు గురై నాగేంద్ర అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. లింగంపల్లికి చెందిన నాగేంద్ర పనులు ముగించుకొని ఆటోలో వెళుతుండగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో తుది పోరులో ఎవరు నిలుస్తారనేది ఇవాళ తేలనుంది. గూడూరులో 15, వెంకటగిరిలో 20, సూళ్లూరుపేటలో 23, సర్వేపల్లిలో 17, నెల్లూరు సిటీలో 27, రూరల్‌లో 24, కోవూరులో 32, కావలిలో 25, ఆత్మకూరులో 23, ఉదయగిరిలో 29 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి 28 నామినేషన్లకు ఆమోదం లభించింది. ఇవాళ సాయంత్రంలోగా EVMలో ఎవరి పేర్లు ఉంటాయో తెలిసిపోతుంది.
Sorry, no posts matched your criteria.