India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోనే ధనిక MP (గుంటూరు) అభ్యర్థిగా బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన అల్లుడు అని స్థానిక వాసులు తెలిపారు. గొడవర్రుకు చెందిన కోనేరు రత్నశ్రీ, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో వీరి పరిచయం ప్రేమ, తర్వాత ‘పెళ్లి’కి దారితీసింది. గొడవర్రులో రెండున్నర ఎకరాల పొలం ఉన్నట్టు ఆయన ఇటీవల నామినేషన్‌లో చూపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ప.గో. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. సోమవారం పిఠాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గణపవరం చేరుకొని పోలీస్ ఐల్యాండ్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిప్పర, చిటకంపాడు లాకులు మీదుగా రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకొని అక్కడ సభలో పాల్గొంటారు.
తమను ఉన్నత స్థానాలకు చేరేలా విద్యను అందించిన ఉపాద్యాయులకు విద్యార్థులు అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో, చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బండి జేమ్స్ అనే ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.12 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసింహారావు, అధ్యాపకులు ఉన్నారు.
విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. పీజీలో సీటు రాలేదని మనస్తాపానికి గురైన డా.షేక్ గని అతావుల్లా(25) ఆదివారం నంద్యాల శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇతను దేవనకొండ మాండలం తెర్నేకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మర్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్, వైసీపీ యువజన అధ్యక్షుడులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేడు కైకలూరులో పర్యటనించనున్నారు. ఆయన కైకలూరులోని ఏలూరు రోడ్‌లో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి సీతారామ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే DNR, MLC జయమంగళ, వైసీపీ నేత బీవీ రావు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు.
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు, భార్య సూర్యకుమారి కలిసి కోడలు నాగ శ్రావణి(25)ని రోకలిబండతో కొట్టి హత్యచేశారు. శ్రావణి భర్త శ్రీనివాసరావు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రావణి తల్లిదండ్రులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్ షోలో పాల్గొని ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈనెల 30న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి వద్ద లారీ- ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో పుట్టినరోజు వేడుకులు నిర్వహించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సాపే నవీన్, జతిన్, నవీన్ కుమార్, అజయ్ మామిడికుదురు మండలవాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.