Andhra Pradesh

News July 13, 2024

అనంతపురం: భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు

image

అనంతపురంలో 1200 ఎకరాల భూమి చూపిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం అమరావతిలో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

News July 13, 2024

విశాఖ డీసీపీగా అజిత

image

విశాఖకు కొత్తగా ఇద్దరు డీప్యూటీ కమిషనర్ ఆఫీ పోలీసు(డీసీపీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీసీపీగా అజిత వెజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై విశాఖ రానున్నారు. అలాగే DCP-2గా తూహిన్ సిన్హా సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. సిన్హా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా ఉన్నారు. కాగా అజిత గతంలో విశాఖ SEB అధికారిణిగా పనిచేశారు.

News July 13, 2024

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసిన తుషార్ డూడిని బాపట్ల ఎస్పీగా నియమించారు. కాగా త్వరలోనే గుంటూరు జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.  

News July 13, 2024

విజయవాడ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న అధిరాజ్ సింగ్ రాణాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా అధిరాజ్ సింగ్ రాణాని నంద్యాల జిల్లా ఎస్పీగా నియమిస్తూ.. సీఎస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News July 13, 2024

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్‌గా మలికా గర్గ్‌ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.

News July 13, 2024

ఉమ్మడి తూ.గో జిల్లా నూతన ఎస్పీలు వీరే

image

☞ తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీశ్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో టీటీడీ CVSOగా ఉన్న డి.నరసింహ కిషోర్ ఎస్పీగా రానున్నారు.
☞ కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్పీ సతీష్ కుమార్ బదిలీపై గుంటూరుకు వెళ్లనున్నారు.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో బి.కృష్ణారావు ఎస్పీగా రానున్నారు.

News July 13, 2024

SKLM: నూతన ఎస్పీగా మహేశ్వరరెడ్డి

image

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా కె.వి మహేశ్వర రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 37 మంది IPSల బదిలీలు జరగగా, అందులో శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.ఆర్ రాధిక ఉన్నారు. బదిలీ అయిన రాధికకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.

News July 13, 2024

నెల్లూరు జిల్లా కొత్త SPగా కృష్ణకాంత్

image

నెల్లూరు నూతన ఎస్పీగా జి.కృష్ణకాంత్ నియమితులయ్యారు. ఆయన కర్నూలు ఎస్పీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు ఎస్పీగా వ్యవహరించిన ఆరిఫ్ హఫీజ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆయనను సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.

News July 13, 2024

ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు బదిలీ

image

ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు. కాగా.. ప.గో ఎస్పీ అజిత వేజెండ్ల విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్-1గా వెళ్తున్నారు.

News July 13, 2024

పల్నాడు, బాపట్ల ఎస్పీలు బదిలీ

image

పల్నాడు, బాపట్ల జిల్లా ఎస్పీలు మలికా గర్గ్, వకుల్ జిందాల్‌ను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్‌, విజయనగరం APSP బెటాలియన్‌ కమాండెంట్‌గా మలికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్ వచ్చారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పాటైనప్పటి నుంచి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పని చేస్తున్నారు.