India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన 5K రన్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైజాగ్ వాలంటీర్లు, స్వీప్ అధికారులు, సాధారణ పౌరులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం చిత్తూరుకు రానున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా వస్తున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 5,777 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. 1,445 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,404 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 209 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలపారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సాధారణ ఎన్నికలకు సంబంధించి నియమించిన పోలింగ్ సిబ్బంది ఎవరైనా శిక్షణా తరగతులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జనరల్ అబ్జర్వర్ కునాల్ సిల్ కు పేర్కొన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు సిబ్బంది చొప్పున 15% రిజర్వుతో టీంలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశామన్నారు. పీఓ, ఏపీఓలకు మే 2, 3 తేదీల్లో శిక్షణ జరుగుతుందన్నారు.
నామినేషన్ అఫిడవిట్‌లో పోలీసు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంపై స్వతంత్ర అభ్యర్థి బొర్రా వెంకట అప్పారావుకు నోటీసు అందజేసినట్లు ఎన్నికల అధికారి వి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన నామినేషన్ అఫిడవిట్‌లో సత్తెనపల్లి పట్టణం, నకరికల్లు పోలీసు స్టేషన్లలో గతేడాది నమోదైన 2కేసుల వివరాలు నమోదు చేయలేదని అన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ..లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని RO నోటీసులో పేర్కొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా విద్యుత్, రెవెన్యూ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మూర్తి శనివారం తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు చెల్లించే అవకాశం కల్పించామన్నారు. ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో సైతం చెల్లింపులు చేయవచ్చని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి చెందిన తమరాపు లక్ష్మణరావు (40) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన లక్ష్మణరావు ఓ ప్రైవేటు కంపెనీలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. శనివారం విషయం తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 17,04,007 కు చేరుకుంది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య ఇలా..!
తిరువూరు: 2,07,190
విజయవాడ పశ్చిమ: 2,55,963
విజయవాడ సెంట్రల్: 2,77,724
విజయవాడ తూర్పు: 2,70,624
మైలవరం: 2,81,732
నందిగామ: 2,05,480
జగ్గయ్యపేట:2,05, 364
Sorry, no posts matched your criteria.