Andhra Pradesh

News July 22, 2024

ప్రకాశం: గేదెలు అడ్డురావడంతో ఇద్దరి మృతి

image

మార్కాపురం మండలం తిప్పాయపల్లెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెలు అడ్డంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదెలను తప్పించబోయి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గేదెలను మేతకోసం పశుపోషకులు వదిలేస్తున్నారని, అవి రోడ్డుపై తిరగడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

News July 22, 2024

అనంతపురం జిల్లాలో ఐదుగురి అరెస్ట్

image

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన రెడ్డప్పరెడ్డి పొలంలో మామిడి చెట్లు నరికివేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై చిన్న రెడ్డప్ప తెలిపారు. గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు వెంకటస్వామి, నాగభూషణం, శ్రీనివాసులు, రాఘవేంద్ర, గోపాల్‌లు రెడ్డప్ప రెడ్డి పొలంలో 150 మామిడి చెట్లు నరికి వేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.

News July 22, 2024

ఈ పాపం ఊరికే పోదు: చెవిరెడ్డి

image

రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలి. నీ అద్భుత నటనతో గాయం కాని ఘటనలో 37 మంది అమాయకులను జైలుకు పంపించావు. ఆ కుటుంబాల శాపాలు నీకు తగులుతాయి. ఈ పాపం ఊరికే పోదు. దేవుడు, ప్రకృతి గొప్పవి. గుర్తుంచుకో’ అని చెవిరెడ్డి అన్నారు.

News July 22, 2024

అల్లూరి జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు

image

అల్పపీడన ప్రభావంతో వర్షాలు జోరుగా కురుస్తుండంతో అల్లూరి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం కూడా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. జిల్లాలోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలలో అన్ని విద్యా సంస్థలకు సోమ, మంగళవారం రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఈ ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేయాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 22, 2024

తహశీల్దార్లను రిలీవ్ చేసిన కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చిన 29 మంది తహశీల్దార్లను సొంత జిల్లాలకు పంపుతూ రిలీవ్ చేశారు. ఆయా మండలాల్లో డిప్యూటీ తహశీల్దారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలను జారీ చేశారు.

News July 22, 2024

విద్యుత్ శాఖ ఎస్ఈగా సంపత్ కుమార్ బాధ్యతల స్వీకరణ

image

ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా కొమ్ము సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారని ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గ కో ఇన్‌ఛార్జ్ పెద్ద పుల్లయ్య మాదిగ ఆదివారం పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్‌కు ఎమ్మార్పీఎస్ తాడిపత్రి టీం తరఫున శుభాకాంక్షలు తెలిపామన్నారు.

News July 22, 2024

అధికారులు సంసిద్ధంగా ఉండాలి: కోనసీమ కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉద్ధృతి పెరగడం, 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం నేపథ్యంలో ప్రజలకు సమర్థవంతంగా సహాయక చర్యలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సూచనలు చేశారు. నేడు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రోగ్రాం ఉంటుందన్నారు.

News July 22, 2024

TPT: డిప్లమా కోర్సులో దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ యానిమల్ హస్బండరీ (Animal Husbandry Diploma) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. పదో తరగతి పాసైనా అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 22.

News July 22, 2024

నేటి ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు: ప.గో కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాంను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కలెక్టర్ కోరారు.

News July 22, 2024

ఇడుపులపాయ: నేటి నుంచే ఆర్జీయూకేటీ అడ్మిషన్లు!

image

ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ IIIT గ్రంథాలయం వేదికగా IIIT 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు జులై 22, 23వ తేదీలలో ఆర్కేవ్యాలీ IIIT, 24, 25 తేదీలలో ఒంగోలు IIIT అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు సోమవారం ధ్రువపత్రాలు పరిశీలించి అడ్మిషన్లు కల్పించనున్నారు.