Andhra Pradesh

News March 18, 2024

తూ.గో జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-1: జేసీ

image

తూ.గో జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో APPSC గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎన్.తేజ్ భరత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 8,258 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కి ఉదయం 5,056 (61.23 %) మంది హాజరయ్యారని, 3,202 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పేపర్-2కి మధ్యాహ్నం
5,007 (60.63 %)  మంది హాజరు కాగా.. 3, 251 మంది గైర్హాజరయ్యారన్నారు.

News March 18, 2024

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ‘స్పందన’ రద్దు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

News March 18, 2024

చిత్తూరు: స్పందన రద్దు

image

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీలు ఇవ్వడానికి ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

News March 18, 2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: నెల్లూరు జేసీ

image

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

News March 18, 2024

జాతీయ లోక్ అదాలత్.. 1760 కేసుల పరిష్కారం

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు 32 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు 1,971 కేసులను రాజీ చేశామన్నారు. అందులో 1,760 పెండింగ్ కేసులకు పరిష్కారం చూపామని చెప్పారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 2,356 పెట్టీ కేసులను కూడా రాజీ చేశామన్నారు.

News March 18, 2024

నాయకులతో SVSN వర్మ మీటింగ్.. సూచనలు

image

పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు కలిసి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలుపించుకోవాలన్నారు. దీనికి కోసం ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. వైసీపీ పాలనలో విసిగిన ప్రజలకు రాబోయే ఎన్నికలు ఒక వరం లాంటివని అన్నారు.

News March 18, 2024

శ్రీకాకుళం: కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం రద్దు

image

నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

News March 18, 2024

విశ్వవిద్యాలయం అభివృద్ధి ధ్యేయం: వైస్ ఛాన్స్‌లర్

image

కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

News March 18, 2024

ఎన్నికల నియమావళి ఉల్లంగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరూ కచ్చితంగా పాటించాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు కూడా సభలు ,సమావేశాలకు ముందస్తుగా అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 18, 2024

పోలీస్ కార్యాలయంలో స్పందన రద్దు: ఎస్పీ తుషార్

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.