India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎమ్మిగనూరు మండలం కే.తిమ్మాపురానికి చెందిన రైతు రంగన్న(39) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి తన సొంత పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. రంగన్న 2 ఎకరాలు సొంత భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతిచెందారు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతా నగర్‌కు చెందిన హారిక పశువైద్యురాలు MS చేయడానికి ఆమె గత ఏడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ NRIలతో సంప్రదిస్తున్నారు.

ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. కడప జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న కమిషనర్ అదితి సింగ్‌ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అదితి సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరూ తమ విధులను బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ సి.నాగరాణి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వరదల దృష్ట్యా శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వగా.. ఆదివారం సాధారణ సెలవు.

సిలిగాట్ నుంచి తాంబరం వెళ్తున్న నాగన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించిన ఘటన కావలి సమీపంలో చోటుచేసుకుంది. రైల్లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో రైల్వే అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద 42.50 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరిందని అధికారులు పేర్కొన్నారు.

మనుబోలు మండలం పిడూరు నుంచి లక్ష్మీ నరసింహ పురం కాగితాలపూరు వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల ఈ రహదారిని నిర్మించినప్పటికీ రెండు చోట్ల కూలిపోయింది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రాకపోకలు పునరుద్ధరించాలని స్థానికులు అన్నారు.

కర్నూలులోని మైపర్ ఫార్మసీ కళాశాలలో 2 రోజుల పర్యటన ముగిసిందని కళాశాల డైరెక్టర్ ఆదిమూలపు సతీశ్ తెలిపారు. బెంగళూరులోని NAAC ప్రధాన కార్యాలయం నియమించిన ముగ్గురు సభ్యుల బృందం కాలేజీలోని వివిధ విభాగాలను, ప్రయోగశాలలను, ఆట స్థలాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముగ్గురు అధికారుల బృందం శని, ఆదివారాలలో వివిధ విభాగాల ఫైల్స్‌ను పరిశీలించారు. NAAC పర్యటన విజయవంతమైందని ఆదిమూలపు సతీశ్ తెలిపారు.

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో డిగ్రీ 3వ సెమిస్టర్, ఈ ఏడాది జులై నెలలో 6వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

చారిత్రక నిర్మాణమైన గండికోటకు ప్రపంచస్థాయి పర్యాటక శోభను తీసుకొస్తామని కలెక్టర్ లోతేటి శివ శంకర్ అన్నారు. ఆదివారం గండికోటను ఆర్డీవో శ్రీనివాసులు, స్వదేశీ దర్శన్ 2.0 ప్రాజెక్టు అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. మొదటగా గండికోటలోని జుమా మసీదును పరిశీలించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సభ్యులు గండికోట విశేషాలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.