Andhra Pradesh

News July 18, 2024

కృష్ణా యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా శ్రీనివాసరావు

image

కృష్ణా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌(వీసీ)గా ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా JNTU కాకినాడలో EEE విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావును ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 18, 2024

శ్రీకాకుళం: ఈ నెల 21న గ్రూప్-2 మాక్ టెస్ట్ 

image

ఎర్రన్న విద్యాసంకల్పం ద్వారా ఈ నెల 21న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యాధరి డిగ్రీ కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి కళాశాల, పలాస మదర్ థెరిసా పాఠశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు https://bit.ly/YVSexam లింక్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

News July 18, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: గుడివాడ

image

APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 18, 2024

SV యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా అప్పారావు

image

SV యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ VCగా అప్పారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పారావు SVUలో బయోకెమిస్ట్రీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వి.ఉమను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమె సోషియాలజీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

ANU ఇన్‌ఛార్జ్ వీసీగా కంచర్ల గంగాధర్ నియామకం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 18, 2024

అనంత JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ సుదర్శన రావు

image

అనంతపురం JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా సీనియర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు నియమితులయ్యారు. ఈయన ఇదే జేఎన్టీయూలోనే బీటెక్ (1979-83) పూర్వ విద్యార్థి కావడం విశేషం. గతంలో ఈయన తన మెరిట్ ప్రతిపాదన క్రింద జేఎన్టీయూ రెక్టార్‌గా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు.

News July 18, 2024

యోగివేమన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా కృష్ణారెడ్డి

image

డప యోగివేమన యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా కృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కడప వైవీయూకు కృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన గతంలో వైవీయూ ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు.

News July 18, 2024

ఏయూ ఇన్‌ఛార్జ్ వీసీగా శశి భూషణరావు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.

News July 18, 2024

రామసముద్రం: చేతికి అందే ఎత్తులో విద్యుత్ వైర్లు

image

రామసముద్రం మండలం మినికి సమీపంలోని పొలంలో 11కేవీ విద్యుత్ లైన్ చేతికి అందే ఎత్తులో ఉంది. పొలంలో రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు కూడా భయపడుతున్నారు. పొలం దుక్కి చేయాలంటే ట్రాక్టర్ గాని లారీలు గాని నడపలేని పరిస్థితి నెలకొంది. వైర్లు అంత కిందకు వేలాడుతుండటంతో ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News July 18, 2024

ఏయూ ఇన్‌ఛార్జ్ వీసీగా శశి భూషణరావు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.