India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు: విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ శనివారం ప్రకటనలో వెల్లడించారు. కర్నూలులోని 9 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 3,883 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9:30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల రేపు సాయంత్రం 4 గంటలకు టెక్కలి రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డా. పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ కూడలి వద్ద జరిగే సమావేశంలో షర్మిల ప్రసంగిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె టెక్కలి, పలాసలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.
నగరాన్ని వైసీపీ ప్రజా ప్రతినిధులు బ్లేడ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్లకు నిలయంగా మార్చేశారని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురందీశ్వరి ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్లో పాదయాత్ర ముగిసిన తరువాత జరిగిన సభలో కూటమి అభ్యర్థులు ప్రసంగించారు.
పతకాలు సాధించే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. శనివారం స్థానిక జొహరాపురంలోని టెన్నిస్ కోర్టులో నిర్వహించిన రెండు రోజుల గ్రేటర్ రాయలసీమ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు.
టెక్కలి-రావివలస రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక బర్మా కాలనీ వద్ద శనివారం రాత్రి వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొనడంతో రోడ్డుపైన పడి తీవ్రంగా గాయాపడింది. క్షతగాత్రురాలిని 108లో చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కందుకూరులో వైసీపీకి షాక్ తగిలింది. అ పార్టీకి చెందిన ప్రముఖ కాపు బలిజ నాయకులు దారం మాల్యాద్రి, దారం కృష్ణ తమ అనుచర గణంతో శనివారం జనసేన పార్టీలో చేరారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఈ నాయకులు ఇద్దరూ శనివారం తమ అనుచరులతో కలిసి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు సమక్షంలో జనసేనలో చేరారు.
రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది.
చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ఘటనలో డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు.
చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ప్రమాద స్థలంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నందు 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) పద్ధతిలో బి.ఎడ్ (B.Ed) ఆన్ లైన్ వెబ్ ఆప్షన్ల కోసం ఏప్రిల్ 30 తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రాంతీయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడగలరు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 7న రాజమండ్రి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, పోలీస్ అధికారులు ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణ నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. వేమగిరి గైట్ కళాశాల స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.