Andhra Pradesh

News April 27, 2024

అది మ్యానిఫెస్టో కాదు.. జగన్ రాజీనామా లేఖ: లోకేశ్

image

శనివారం జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో లోకేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి, పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత తనదన్నారు.

News April 27, 2024

పుంగనూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి

image

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ప్రసన్నగారిపల్లె గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు జగదీష్ (15) స్కూలుకు సెలవులు కావడంతో గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

అల్లూరి జిల్లాలో విషాదం.. పచ్చ కామెర్లతో బాలిక మృతి

image

అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. పచ్చ కామెర్లు ముదిరి ఓ గిరిజన బాలిక ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం, బొర్రా పంచాయతీ జీరుగెడ్డకు చెందిన సోమేశ్- సుజాత దంపతుల కుమార్తె దేవిశ్రీ(6) మూడు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. పచ్చకామెర్లు ముదిరి శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం అందకే బాలిక మృతి చెందిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News April 27, 2024

తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరి 9:45 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10:30 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు.

News April 27, 2024

ఒంగోలు పార్లమెంట్ అప్‌డేట్స్

image

➤ మొత్తం ఓటర్ల సంఖ్య: 18,22,470➤ పురుషుల ఓటర్లు: 9,07,980➤ మహిళా ఓటర్లు: 9,23,374➤ఇతరులు: 111➤పోలింగ్ బూత్‌ల సంఖ్య: 2187అభ్యర్థులు:-➤ వైసీపీ అభ్యర్థి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి➤ కూటమి అభ్యర్థి: మాగుంట శ్రీనివాసులు రెడ్డి➤ కాంగ్రెస్ అభ్యర్థి: సుధాకర్ రెడ్డి

News April 27, 2024

ఎచ్చెర్ల: మళ్లీ వైసీపీ గూటికి చేరిన పైడి శ్రీనివాసరావు

image

ఇటీవల వైసీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గానికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News April 27, 2024

చిత్తూరులో ఘనంగా నూతన కోర్ట్ భవనాల ప్రారంభోత్సవం

image

చిత్తూరులో శనివారం నూతన న్యాయస్థాన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిజీగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవానికి రావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో బార్ అసోసియేషన్ భాగస్వామ్యాన్ని అభినందించారు.

News April 27, 2024

VZM: నియోజకవర్గాల కేటాయింపు పూర్తి  

image

జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా PO, APO, OPOల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్ఐసీలో రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12, 522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీశ్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసీ అధికారులు నిర్వహించారు.  

News April 27, 2024

మా ఆత్మకూరుకు ఇవి కావాలి: ఆనం

image

ఆత్మకూరు ప్రజాగళం సభలో చంద్రబాబుకు ఆనం రామనారాయణ రెడ్డి వినతులు విన్నవించుకున్నారు. ‘సోమశిల హైకెనాల్ పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలి. నదికూడి శ్రీకాళహస్తి లైన్ టీడీపీ హయాంలో మొదలు పెడితే.. దానిని వైసీపీ తుంగలో తొక్కింది. మీరు పూర్తి చేయాలి. జిల్లా 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. సోమశీల ప్రాజెక్టును పూర్తి చేయాలి’అని కోరారు.

News April 27, 2024

ముగిసిన నంద్యాల జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు

image

నంద్యాల జిల్లా న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు ముగిశాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన రావినూతల దుర్గాప్రసాద్ తన ప్రత్యర్థి నందీశ్వర్ రెడ్డిపై 99 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన వెంకటేశ్వర్లు ప్రత్యర్థి శ్రీనివాసులుపై 141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్పోర్ట్స్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన భూమా వెంకటరెడ్డి తన ప్రత్యర్థి చిన్న లింగమయ్యపై 105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.