India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీఎం చంద్రబాబు నేడు సత్యసాయి జిల్లాలో పింఛన్ పంపిణీ చేయనున్నారు. మడకశిర మండలం గుండుమలలో ఓబుళమ్మ, వృద్ధుడు రామన్నకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము అందజేస్తారు. అనంతరం రంగనాథ్ అనే రైతుకు చెందిన మల్బరీ పంటను పరిశీలిస్తారు. ప్రజా వేదికలో పలువురు రైతులు, బీఈడీ అభ్యర్థితో మాట్లాడి డ్రిప్ పరికరాలు, సెరికల్చర్, మెగా డీఎస్సీపై అభిప్రాయాలను తెలుసుకుంటారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. తొలిరోజే అందరికీ నగదు అందజేయాలన్న లక్ష్యంతో సచివాలయ అధికారులు ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతున్నారు. లబ్ధిదారులకు రూ.4 వేలు చొప్పున పింఛన్ ఇస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజా నగర్ 6వ వార్డు టీడీపీ నాయకులు బచ్చా భాయ్, ఉస్మాన్ రహమద్ బాషా, షఫీతో కలిసి నగదు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాలలో అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీలోపు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టరేట్ కాంపౌండ్, వికాస ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.

కుప్పం పట్టణంలోని పాత వైసీపీ కార్యాలయం హోటల్‌గా మారనుంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు వైసీపీ నాయకులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. పార్టీ కార్యకలాపాలు పెద్దగా నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్ తన క్యాంపు కార్యాలయంలోనే పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పాత ఆఫీసు భవనాన్ని ఖాళీ చేశారు. సదరు యజమాని అందులో హోటల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ వద్ద స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు 18-40 ఏళ్ల మధ్య వయస్సున్న యువతీయువకులు అర్హులన్నారు. అలాగే అభ్యర్థులు తగిన అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీతం రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండనుంది.

ప్రకాశం జిల్లాకు నేడు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ప్రకటించిన విపత్తుల సంస్థ జిల్లాలోని పలు మండలాలలో ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళవద్దని వెళ్లొద్దని సూచించింది.

శ్రీశైల భ్రమరంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో పెద్దిరాజు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

కడప జిల్లా వ్యాప్తంగా నేడు జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పని కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కోసం బయోమెట్రిక్ యాప్‌ను ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

తక్కువ మొత్తంలో పెట్టుబడులు-ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దామోదర్ కోరారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, కంపెనీ బ్రాండ్‌ను పోలిన వెబ్‌సైట్‌లను రూపొందించి సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని అన్నారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులతో వేడుకల నిర్వహణకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కడప పోలీస్ మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.