Andhra Pradesh

News August 4, 2024

కడప: 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

దువ్వూరు మండలం దాసరిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు అర్బన్ సీఐ మస్తాన్ తెలిపారు. ఆదివారం దువ్వూరు పోలీస్ స్టేషన్‌ సీఐ మాట్లాడుతూ.. దువ్వూరుకు చెందిన పోలయ్య, తమిళనాడుకు చెందిన వేలన్ మణి, రాజన్ ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకొని వారి వద్ద నుంచి 5 గొడ్డళ్లు, 3 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

News August 4, 2024

కృష్ణా: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) మూడేళ్ల డిప్యుటేషన్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని CRDA వెల్లడించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకై https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News August 4, 2024

సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు: మంత్రి మండిపల్లి

image

కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, ఆర్టీసీ కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

News August 4, 2024

ఏలూరు: బస్సుల టైర్లు, బ్యాటరీలు దొంగతనం

image

ఏలూరు జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుల టైర్లు, బ్యాటరీలు చోరీ చేసిన నలుగురిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. కామవరపుకోటలోని ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన 2 బస్సుల టైర్లు, బ్యాటరీలు, జాకీలు, ఇతర సామగ్రి పోయినట్లు నందిగామ ధర్మరాజు ఫిర్యాదు చేశాడు. విచారణలో చందు, ఈశ్వర్ కుమార్, సాయి దుర్గారావు, వెంకట్ కాజేశారని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

News August 4, 2024

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

image

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం చెందిన వంశీకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి శ్రీశైలం వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో బోడే నాయక్ తండ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రక్షణ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 4, 2024

మార్చి నాటికి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు : పెమ్మసాని

image

దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్‌ను స్థానిక MLA శ్రవణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.

News August 4, 2024

సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు: మంత్రి మండిపల్లి

image

కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, నూతన ఆర్టీసీ బస్సులను మండిపల్లి ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

News August 4, 2024

కొవిడ్ కాల నష్ట నివారణపై ప్రశ్నించిన MP మాగుంట

image

దేశంలో కొవిడ్-19 వ్యాప్తి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్రాలలోని రేషన్ కార్డుల క్రింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు కొనసాగింపు, మొదలగు కార్యక్రమాలతో నష్ట నివారణ జరిగిందన్నారు.

News August 4, 2024

విశాఖ: ఇది కదా ఫ్రెండ్‌షిప్ అంటే..!

image

ఓ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగిస్తున్నారు. ఏటా స్నేహితుల దినోత్సవాన కలుస్తూ ఉంటారు. అయితే వారిలో కే.కోటపాడు మండలం పాచిలవానిపాలెంకి చెందిన అప్పారావుకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. దీంతో ఈ ఏడాది మిగిలిన స్నేహితులు రూ.50 వేలు పోగు చేసి ‘ఫ్రెండ్‌షిప్ డే’న అందజేశారు. సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ ఆదుకున్నవారే స్నేహితులని నిరూపించారు. మరి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా..?

News August 4, 2024

ఏలూరు జిల్లాలో 9మంది SIల బదిలీ

image

ఏలూరు జిల్లాలో 9మంది SIలు బదిలీ అయ్యారు. భీమడోలు ఎస్సైగా సుధాకర్, లక్కవరం ఎస్సై సుధీర్ ద్వారకాతిరుమల స్టేషన్‌కు, ద్వారకాతిరుమల ఎస్సై సతీష్ వీఆర్‌కు, తడికలపూడి ఎస్సై జైబాబు టి.నరసాపురానికి, టి.నరసాపురం ఎస్ఐ మహేశ్వరరావు వీఆర్‌కు, చింతలపూడి ఎస్సైగా కుటుంబరావు, జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ కొయ్యలగూడెం స్టేషన్‌కు, కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్ధన్ వీఆర్‌కు, నిడమర్రు ఎస్సై శ్రీను వీఆర్‌కు బదిలీ అయ్యారు.