Andhra Pradesh

News August 5, 2024

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు హవా

image

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా విజయనగరం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 

News August 5, 2024

నేడు కడప జిల్లాలో పరవళ్లు తొక్కనున్న కృష్ణమ్మ

image

తెలుగుగంగ కాలువలో నేడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. అధికారుల వివరాల ప్రకారం.. నేటి మధ్యాహ్నానికి జిల్లా సరిహద్దు 98,260 కి.మీ వద్దకు నీరు చేరుతుందన్నారు. అయితే 2వ తేదీన వెలుగోడు జలాశయం నుంచి తెలుగు గంగకు నీరు విడుదల చేయగా.. కాలువ వెంట నీరు పరుగులు తీస్తోంది. 67వ KM వద్ద 2,700 క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. కాగా నేటి మధ్యాహ్నంలోగా కడప జిల్లాకు కృష్ణమ్మచేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.

News August 5, 2024

మాచర్ల: బీటెక్ విద్యార్థిని సూసైడ్

image

మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 5, 2024

నేడు నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్..?

image

నంద్యాల జిల్లాలో మరికాసేపట్లో YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. TDP నేతల దాడిలో మృతి చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురం గ్రామానికి చెందిన YCP కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. నంద్యాలకు వస్తున్నట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.

News August 5, 2024

నెల్లూరు క్లబ్ పాలకవర్గానికి 18 నామినేషన్‌లు

image

నెల్లూరు క్లబ్ ఎన్నికలకు సంబంధించి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ వాడివేడిగా ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ సంబంధించి మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారి వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు ఆమోదముద్ర వేశారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది.

News August 5, 2024

విశాఖ: బాలుడిపై పోక్సో కేసు

image

విశాఖ జిల్లాలోని ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీకి చెందిన ఓ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో ఆమె కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతి అని తేలింది. దీనికి కారణమైన అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై బాలిక తల్లి ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరావు తెలిపారు.

News August 5, 2024

కడప: ‘వెంటనే టీచర్ల సర్దుబాటు నిలిపివేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేయడంతో తీరని నష్టం జరుగుతోందని, వెంటనే నిలిపివేసి పదోన్నతులు కల్పించాలని.. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. విద్యారంగానికి తీరని నష్టం కలిగించే 117 జీవోను రద్దు చేస్తామని చెప్పిన నారా లోకేశ్ టీచర్ల సర్దుబాటు చేయటం సమంజసం కాదన్నారు.

News August 5, 2024

శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

image

తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తులు డైరెక్ట్ క్యూ లైన్‌లో వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాగా ఆదివారం 75,356 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

News August 5, 2024

కడప జిల్లాలో 2,200 పాఠశాలల్లో ఎన్నికలు

image

కడప జిల్లాలో 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికలతో పాత కమిటీల కాలపరిమితి ముగిసింది. దీంతో రెండేళ్ల కాలపరిమితితో కొత్త కమిటీల నియామకం చేపట్టనున్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులే ఓటర్లుగా ఉంటారు. ఈనెల 8 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. పాఠశాలలను అభివృద్ధి చేసేవారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

News August 5, 2024

మహానంది: సీతారామపురంలో భయం.. భయం

image

మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో భయం భయం నెలకొంది. డీఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుని మృతుడు సుబ్బరాయుడు భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.