Andhra Pradesh

News April 27, 2024

కర్నూలు జిల్లాలో ఎన్ని నామినేషన్లు తిరస్కరించారంటే..?

image

కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం సంబంధిత ఆర్వోల ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. కర్నూలు MP స్థానానికి 27 నామినేషన్లలో 7 నామినేషన్లు తిరస్కరించారు. ఎమ్మెల్యే స్థానాల వారీగా కర్నూలు 41 నామినేషన్లలో.. 14 తిరస్కరించారు. ఇలా పాణ్యం 24కు 9, కోడుమూరు 21లో 5, ఆదోని 15లో 4 నామినేషన్లను తిరస్కరించారు. మంత్రాలయం 12కు 2, ఆలూరు 15కు2, పత్తికొండ 14కు3, ఎమ్మిగనూరు 15కు5 తిరస్కరించారు.

News April 27, 2024

రైల్వేకోడూరు: YCPలోకి జనసేన కీలక నేతలు

image

రైల్వేకోడూరులోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం జనసేన రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జ్ కుప్పాల జ్యోతి, కుప్పాలా కిరణ్, వీపీఆర్ కండ్రిక మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు వైసీపీలోకి చేరారు. వీరికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 27, 2024

చిత్తూరులో ఆమోదించిన నామినేషన్ల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆమోదించిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరులో 15 నామినేషన్లు దాఖలు కాగా 10 వాటిని ఆమోదించారు. నగరిలో 24 కు 7, జీడి నెల్లూరులో 21కి 12, చిత్తూరులో 21కి14, పూతలపట్టులో 19 కి 12, పలమనేరులో 19 కి 14, కుప్పంలో 18కి 15 నామినేషన్లు ఆమోదించినట్టు చెప్పారు. చిత్తూరు ఎంపీ స్థానానికి 35 నామినేషన్లు దాఖలు కాగా 21 వాటిని ఆమోదించామన్నారు.

News April 27, 2024

మాజీ MLA ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ

image

చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు విషయం సందిగ్ధంగా మారింది. ఆమంచికి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు, క్రిస్టల్ సీఫుడ్స్ ఫ్యాక్టరీకి విద్యుత్ బకాయిలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్వో సూర్యనారాయణరెడ్డి ఆమంచి నామినేషన్ పెండింగ్లో ఉంచారు. శనివారం ఉదయం 10లోపు వాటిని సబ్మిట్ చేయాలని సూచించారు. దీంతో ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.

News April 27, 2024

మైలవరంలో బీసీవై పార్టీకి ఎదురుదెబ్బ

image

మైలవరంలో బీసీవై పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసిన కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి నామినేషన్‌‌ను తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ మైలవరం బరిలో లేనట్లే. 175 నియోజవర్గాల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ అధినేత ఆశలు అడియాసయ్యాయి. బరిలో నిలుద్దామనుకున్న అభ్యర్థికి కూడా షాక్ తగిలినట్లు అయింది. ఈమె ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

News April 27, 2024

పిఠాపురంలో నేడు పవన్ కోసం హీరో వరుణ్ తేజ్ ప్రచారం

image

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా సినీ హీరో కొణిదెల వరుణ్ తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్ షో ప్రారంభమై వన్నెపూడి మీదుగా సాగుతుందన్నారు. అనంతరం కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు.

News April 27, 2024

సత్యవేడు: మాజీ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ

image

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత నామినేషన్ శుక్రవారం తిరస్కరణకు గురి అయింది. ఆమె టీడీపీ తరఫున ఒక సెట్టు నామినేషన్ వేశారు. పార్టీ బీఫామ్ సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

News April 27, 2024

స్వతంత్ర అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణ

image

మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట ఎన్నికల ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. కాగా లావణ్య నేరుగా కాకుండా తన తరపు వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేశారు. దీనితో శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. మంగళగిరిలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

News April 27, 2024

శ్రీ సత్యసాయి: అనుమానంతో భార్యను చంపిన భర్త

image

పుట్టపర్తి రూరల్ మండలం వెంగళమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. ఈడిగ పవన్ వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల రాజీనామా చేశాడు. భార్య త్రివేణి(25) ఇంటి వద్ద ఉంటూ పిల్లలను చూసుకునేవారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 27, 2024

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు తిరస్కరణ

image

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు సక్రమంగా లేని 41 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కావలి నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించారు. కోవూరులో 9, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 8, ఉదయగిరిలో ఆరు సర్వేపల్లిలో నాలుగు, ఆత్మకూరులో రెండు, కందుకూరు, నెల్లూరు రూరల్‌లో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.