Andhra Pradesh

News April 27, 2024

నేడు జిల్లాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాక: కలెక్టర్ షణ్మోహన్

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నేడు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ భట్టి చిత్తూరుకు రానున్నారని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. జిల్లా నూతన ప్రధాన న్యాయస్థాన భవన సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

News April 27, 2024

కర్నూలు: 13 మంది నామినేషన్ల తిరస్కరణ

image

కర్నూలు అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీలో 13 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పేర్కొన్నారు. 40 మంది అభ్యర్థుల నుంచి అందుకున్న 56 నామినేషన్ల పత్రాలను పరిశీలించామన్నారు. సవ్యంగా పత్రాలు సమర్పించిన 27 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని ఆమోదించామన్నారు. లోపాలు ఉన్న 13 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని తిరస్కరించామని తెలిపారు.

News April 27, 2024

శ్రీకాకుళం అసెంబ్లీకి నుంచి ఒక నామినేషన్ తిరస్కరణ

image

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి సీ.హెచ్ రంగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నామినేషన్ పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో మొత్తం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించగా.. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

News April 27, 2024

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పెనుకొండ ఆర్డీటీ కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రస్తుతం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, గ్రామీణ, ప్రతిభావంతులైన విద్యార్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు, 4 ఫొటోలు తీసుకుని మండల పరిధిలోని ఆర్డీటీ ఆఫీసులో మే 4వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

News April 27, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్.కొంతలపాడు, తొలిశాపురం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి ఆరా తీశారు.

News April 27, 2024

ప్రకాశం: రూ.20 లక్షలు స్వాధీనం

image

జిల్లాలోని పుల్లలచెరువు మండలం మల్లపాలెం చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఒంగోలుకు కారులో తీసుకెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి నుంచి ఆ డబ్బును గుర్తించి, సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రూ.50 వేలకు మించి డబ్బులు ఉంటే సరైన పత్రాలు చూపించాలన్నారు.

News April 27, 2024

VZM: 7 నియోజకవర్గాలు.. 22 నామినేషన్లు REJECT

image

విజయనగరం జిల్లాలో 7అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 105నామినేషన్లు దాఖలు కాగా 83 నామినేషన్లను ఆమోదించినట్లు ఆయా నియోజకవర్గాల ROలు తెలిపారు. రాజాంలో 12 నామినేషన్లకు 10, బొబ్బిలి- 13 నామినేషన్లకు 9, చీపురుపల్లి- 13 నామినేషన్లకు 8, గజపతినగరం- 15 నామినేషన్లకు 13, నెల్లిమర్ల- 16 నామినేషన్లకు 13, విజయనగరం- 20 నామినేషన్లకు 16, ఎస్.కోట- 16 నామినేషన్లకు 14 ఆమోదించి మిగతావి తిరస్కరించామని తెలిపారు.

News April 27, 2024

గుంటూరు: జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో తాడికొండ నియోజకవర్గ పరిధిలో కారులో తీసుకెళ్తున్న సరైన పత్రాలు చూపని రూ.1.50లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,44,57,165ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. 

News April 26, 2024

ఎన్నికల కోడ్ పక్కాగా అమలు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీ.సృజన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన 32 మంది వాలంటీర్లను తొలగించామన్నారు. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 9 మంది రేషన్ డీలర్లతో పాటు ఇతరులపై చర్యలు తీసుకున్నామన్నారు.

News April 26, 2024

నెల్లూరు: చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.. 3.30 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బుచ్చిలో జరిగే సభకు హాజరవుతారు. రాత్రికి బుచ్చిలోనే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తెలిపాయి.