India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం జరిగిన నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిందని రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. మొత్తం 40 నామినేషన్లు పరిశీలించగా.. అందులో 13 నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ప్రకటించారు. 27 మంది అభ్యర్థుల నామినేషన్లను అనుమతించామని ప్రకటించారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన వ్యాన్ డ్రైవర్ గారపాటి త్రిమూర్తులు కుమారుడు వీరసత్య సంతోష్ JEE మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 368 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థిని గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభినందించారు.
పల్నాడు జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 1, 239 మంది హాజరుకాగా, 412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 33.25% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,720 మంది విద్యార్థులు హాజరు కాగా, 1, 549 ఉత్తీర్ణత సాధించారన్నారు. 56.95% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో జనసేన వీరమహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారంతా తెలుపు రంగు చీరపై జనసేన గాజుగ్లాస్ గుర్తు, ఎన్నికల చిహ్నం కలిగిన చీరలు కట్టుకొని ఆకట్టుకొన్నారు.
కడప నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి అవినాశ్, కూటమి నుంచి భూపేశ్, కాంగ్రెస్ నుంచి షర్మిలతో ఇతర పార్టీలకు చెందిన 11 మంది బరిలో నిలిచారు. మరోవైపు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మొత్తం 32 మంది పోటీ పడగా 18 మంది నానినేషన్లు తిరస్కరించారు.
అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి సారించామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే రహదారుల నిర్మాణం, రవాణా వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. ఓటర్లంతా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
విశాఖ నుంచి మలేషియాకు శుక్రవారం నుంచి విమాన సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి రాత్రి 10గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 4.20 గంటలకు కౌలాలంపూర్ చేరుతుంది. కార్యక్రమంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఏపీడీ ఎస్.రాజారెడ్డి, అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.కె.కుమార్ రాజా, ఓ.నరేష్ కుమార్, డీ.ఎస్.వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పరిశీలించారు. కేంద్ర కార్యాలయ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, పార్టీ నేత కేఎస్ఎన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.
పుంగనూరు నియోజకవర్గం నుంచి MLA బరిలో నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం.. అన్ని అంశాలను పరిశీలించి ఆయన నామినేషన్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈయనతో పాటు కూటమి నుంచి బరిలో నిలిచిన చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా ఆమోదించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.