India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. మచిలీపట్నం- విశాఖపట్నం (17219) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి మే 26 వరకు, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి మే 27 వరకు రద్దు అయినట్లు చెప్పారు.
డోన్ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 15సార్లు సాధారణ ఎన్నికలు, రెండుసార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో 8సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ గెలిచింది. 2014,19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై గెలిచారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై బుగ్గన గెలిచి హ్యాట్రిక్ కొట్టేనా..? కామెంట్ చేయండి.
ప.గో.జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 122 మంది అభ్యర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు. భీమవరంలో 8 మంది, తాడేపల్లిగూడెంలో 15 మంది , నరసాపురంలో 7, ఆచంటలో 8, తణుకులో 6, ఉండిలో 10 , పాలకొల్లులో 13 మంది దాఖలు చేశారు.
పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. మసీదు సెంటర్ వద్ద షేక్ ముస్తాఫా (35) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద మంచినీరు పట్టేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు డెక్కన్ టుబాకో కంపెనీలో కార్మికుడిగా పని చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్‌నెస్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమా కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత గురువారం తెలిపారు. జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజోలులోని మలికిపురం కూడలిలో.. 6 గంటలకు ద్రాక్షారామ సుభాష్‌చంద్రబోస్ కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 28న జగ్గంపేట, ప్రత్తిపాడు సభల్లో పాల్గొంటారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనసీమ , కాకినాడ , రాజమండ్రి పార్లమెంటు ఆయా పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ పార్లమెంట్లకు 32, రాజమహేంద్రవరం పార్లమెంటు 19, అమలాపురం పార్లమెంటు 21 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21అసెంబ్లీ స్థానాలకు గాను కాకినాడ జిల్లా 170, తూర్పు గోదావరి జిల్లా 114 డా.బి.ఆర్. కోనసీమ జిల్లా 175 నామినేషన్లు దాఖలయ్యాయి .
ఏలూరు నగర శివారు చాటపర్రుకు చెందిన ఈదుపల్లి పవన్ పోతురాజు (28) లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. ఇతను గురువారం లారీలో వెళుతుండగా కొమడవోలు వద్ద వేరే లారీని తప్పించే క్రమంలో ఆ వాహనం డోర్ తగిలి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పోతురాజును సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని శ్రీను త్రిపురాంతకం రోడ్ సెంటర్‌లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీస్తున్నారు. ఆ ప్రదేశంలో అచ్చు బొమ్మ ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.