India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి-కొవ్వూరు మధ్య ఉన్న గామన్ బ్రిడ్జి మరోసారి మరమ్మతులకు గురైంది. రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు.
భీమిలి నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 3,60,507 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిలో పురుషులు 1,76,860, స్త్రీలు 1,83,632,ఇతరులు 15 మంది కలరు. విస్తీర్ణంలోని పెద్దదిగా గుర్తింపు పొందింది. భీమిలితో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలు, ముఖ్యంగా మధురవాడ నియోజకవర్గంలో కలవు. ప్రముఖ సందర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
విజయనగరం మండలంలో గురువారం మధ్యాహ్నం ఆటో, బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. జామి నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు రామనారాయణం వద్ద టీపాయింట్ సమీపంలో కొత్త భీమసింగి వైపు వెళ్తున్న ఆటోను, ఆ వెనుకే వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. మృతులు పద్మనాభం మండలం చిన్నాపురానికి చెందిన యు.లలిత(35), జామి మండలం కొత్త భీమసింగికి చెందిన పి.శశికుమార్‌గా గుర్తించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు గురువారం నీటిని నిలుపుదల చేశారు. కుడికాలువ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి అవసరాల నిమిత్తం ఈనెల 8న కృష్ణా యాజమాన్య బోర్డు 8టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తవ్వడంతో కేఆర్ఎంబీ ఈఈ రఘునందన్ సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గంటకు 1,000 క్యూసెక్కుల చొప్పున తగ్గిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.
ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేటకు చెందిన చిదపాన శ్రీనును సీతన్నపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.
మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 3 సెట్ల నామినేషన్లు వేశారు. అది కూడా వైసీపీ అభ్యర్థిగా. అదేంటి పొలిటికల్ రిటైర్మెంట్ అని, మళ్లీ నామినేషన్ వేయడం ఏమిటా అని అనుకుంటున్నారా.? తన కుమారుడు పేర్ని కిట్టుకు ఆయన డమ్మీగా నామినేషన్ వేశారు. స్క్రూటినీలో తన కుమారుడి నామినేషన్ అంతా కరెక్ట్‌గా ఉంటే పేర్ని నాని తన నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో బహిరంగ సభ అనంతరం వెంకటగిరికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో TDP రెబల్‌గా దామోదర్ నాయుడు (బుల్లెట్ నాయుడు) నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా.. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్‌గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్‌గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.
Sorry, no posts matched your criteria.