India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి సూచనలు చేశారు.
శ్రీకాకుళం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలకు చెందిన అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1.కాయ దుర్గారావు, 2.బేత వివేకానంద మహరాజ్, 3.BYC పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ, 4.శ్రవణ్ కుమార్, 5.PPI పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ్ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మంగళగిరి వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేరును పోలిన మరో మహిళ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో రాజకుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ వేయడంతో వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి లావణ్యతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.
విజయనగరం జిల్లాలో పార్లమెంటు స్థానానికి 30 సెట్లు, అసెంబ్లీ స్థానాలకు 184 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. పార్లమెంటు స్థానానికి 18 మంది, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు 105 మంది నామినేషన్లు వేశారని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టరేట్ మీడియా సెంటర్‌లో కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
పి.గన్నవరం నియోజకవర్గంలో ఒకే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో పాటు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అదే పేరున్న గిడ్డి సత్యనారాయణ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో గిడ్డి సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. దీంతో ఎవరికి ఏ మేర నష్టం వాటిల్లుతుందో వేచి చూడాలి.
శ్రీ సత్య సాయి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి 231మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 మంది నామినేషన్లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో మరో వ్యక్తి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జనసేన పార్టీ తరఫున గంటా శ్రీనివాస రావు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మరి పోటీలో ఉంటారా నామినేషన్ ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.
పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగి అయ్యన్న నామినేషన్ వేశారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) తరఫున ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన తొలిరోజే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరుకు చేరుకుంటారు. సభ ప్రాంగణం వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన ఈ నెల 28న కందుకూరులో. 30న కొండపిలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు కొండపిలో పర్యటించనున్నారు. సభా ప్రాంగణాల వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.