Andhra Pradesh

News April 25, 2024

తూ.గో.: టీడీపీ జిల్లా కోఆర్డినేటర్‌గా సతీష్

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్‌గా సానా సతీష్ ఎంపికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్‌గా తోట నవీన్, పెద్దాపురం కోఆర్డినేటర్‌గా రాజా సూరిబాబు రాజు, జగ్గంపేట కోఆర్డినేటర్‌గా అప్పలరాజు, కాకినాడ కోఆర్డినేటర్ గా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.

News April 25, 2024

REWIND: ప.గో.: జడ్పీటీసీ ఓడిపోయాడు.. మంత్రి పదవి దూరమైంది

image

ప్రస్తుత ఏలూరు జిల్లాకు చెందిన దెందులూరు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి MLAగా గెలుపొందారు. రెండేళ్లకే మంత్రి (నీటిపారుదల శాఖ) పదవి సైతం వరించింది. ఆ తర్వాత దెందులూరు మండల జడ్పీటీసీ పదవికి ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిచెందాడు. దీంతో మాగంటి మంత్రి పదవికి రాజీనామా చేశారు. జడ్పీటీసీ ఓటమి మంత్రి పదవికే ఎసరుపెట్టినట్లయింది.

News April 25, 2024

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. తప్పిన ప్రమాదం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 25, 2024

వైసీపీలో చేరిన అనీషా రెడ్డి దంపతులు

image

టీడీపీ పుంగనూరు మాజీ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ని వాళ్లు కలిశారు. అనీషా రెడ్డి దంపతులకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పలమనేరు MLA అభ్యర్థి అమరనాథ రెడ్డికి శ్రీనాథ్ రెడ్డి సోదరుడు అవుతారు.

News April 25, 2024

కాకినాడ: టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల..?

image

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లాలో టీడీపీకి షాక్‌ తగలనుంది. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సీటును ఆశించిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు TDPపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి YCPలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్లు టాక్.

News April 25, 2024

గరివిడిలో ఆవుకు వింత దూడ జననం

image

గుర్ల మండలం గొలగం గ్రామానికి చెందిన కలిశెట్టి మురళి ఆవు ప్రసవానికి ఇబ్బంది పడుతుండటంతో, బుధవారం గరివిడి స్థానిక పశువైద్య కళాశాలకు తీసుకొని వెళ్లాడు. కళాశాలలోని సహా ఆచార్యులు ఆవును పరీక్షించి, ఆపరేషన్ చేశారు. ఆడ దూడ 2 తలలు, 2 తోకలు, 4 వెనక కాళ్లు, 2 ముందర కాళ్లు, 3 నాలుకలతో ఉంది. పుట్టిన వెంటనే మరణించింది. జన్యుపరమైన లోపాలతో అరుదుగా ఇలాంటి దూడలు పుడుతుంటాయని
కళాశాల వైద్యులు తెలిపారు.

News April 25, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: ఆర్ఐఓ

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ విద్యామండలి శాఖ ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు కూడా ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించని వారు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకొని విద్యార్థుల ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 25, 2024

సీఎం రమేశ్ సంపద రూ.497.59 కోట్లు

image

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, భార్య శ్రీదేవికి కలిపి రూ.497.59 కోట్ల ఆస్తులున్నాయి. రమేశ్ చర, స్థిరాస్తులు రూ.292 కోట్లు, భార్య స్థిర, చరాస్తులు రూ.205.53 కోట్లు. రమేశ్ పేరుతో వివిధ కంపెనీల్లో 10.49 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. బంగారం ఆయన పేరిట 6.92 కిలోలు శ్రీదేవి పేరిట 8.19 కిలోల ఉంది. వీరికి 3 కార్లు ఉన్నాయి. వీరికి అప్పులు రూ.101.61 కోట్లు ఉన్నాయి. రమేశ్‌పై 7 కేసులు ఉన్నాయి.

News April 25, 2024

గుంటూరు: ‘ఫెసిలిటేషన్ సెంటర్లను వినియోగించుకోవాలి’

image

మే 13న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మే 5 నుంచి 8వరకు మాత్రమే ఆయా నియోజకవర్గములో ఏర్పాటు చేయబడిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో మాత్రమే, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించామని చెప్పారు.  

News April 25, 2024

ప.గో.: అక్కడ సైకిల్ గుర్తు లేకుండానే ఎన్నికలు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా 6 చోట్ల జనసేన పోటీచేస్తుండగా.. 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లెక్కన జనసేన అభ్యర్థులు పోటీచేసే చోట ఎన్నికల్లో టీడీపీ గుర్తు కనిపించదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో కొన్నిస్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది.