Andhra Pradesh

News April 25, 2024

ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వృద్ధుడు నామినేషన్

image

ఉదయగిరి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా అత్యంత సామాన్యుడు, 73 ఏళ్ల వృద్ధుడు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేశ్‌ ప్రేమ్ కుమార్‌కు అందజేశారు. ఆయన వింజమూరు మండలం నల్గొండ గ్రామానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలోని అన్ని మండల ప్రధాన కేంద్రాలు వద్ద రెవిన్యూ సమస్యల గురించి చేతిలో మైకు పట్టుకుని స్వచ్ఛందంగా మాట్లాడుతూ అందరికీ సుపరిచితమైన వ్యక్తిగా గుర్తింపు ఉంది.

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కర్నూలు ఎస్పీ జీ.కృష్ణకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహించాలని ఆదేశించారు. కొత్త వ్యక్తులు వస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

News April 25, 2024

వంగర: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

image

బలిజిపేట మండలం పెద్ద పింకీ గ్రామానికి చెందిన కొంత మంది వంగర మండలం పట్టు వర్ధనం గ్రామానికి శుభకార్య నిమిత్తం గురువారం వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పట్టువర్ధనం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సత్తమ్మ అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను రాజాంలో పలు హాస్పిటళ్లకు తరలించారు.

News April 25, 2024

కడప: రూ.11.41 కోట్ల మద్యం, నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా 44 రోజుల నుంచి చేస్తున్న తనిఖీల్లో రూ.11.41 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులు, నగదును అధికారులు సీజ్ చేసినట్లు కలెక్టరు తెలిపారు. అందులో మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తుసామగ్రి రూ.7.64 కోట్ల విలువైన వస్తు సామగ్రిని వివిధ విభాగాల తనిఖీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.50 వేలకు పైబడి తీసుకెళుతున్న రూ.3,76,96,225 నగదును సీజ్ చేశామన్నారు.

News April 25, 2024

రేపు శ్రీశైలంలో కుంభోత్సవం

image

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భ్రమరాంబ దేవికి సాత్విక బలి, స్వామివారికి అన్నాభిషేకం, కుంభ హారతి, (స్త్రీ వేషంలో పురుషులు అమ్మవారికి హారతి) సమర్పిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం, ఏకాంత సేవ, అన్ని ఆర్జిత సేవలు నిలుపివేశారు.

News April 25, 2024

రంపచోడవరంలో 88 మంది అరెస్ట్

image

ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమై రంపచోడవరం డివిజన్ లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి115 కేసుల్లో 88మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై. రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన అధికారి దిగంబర్ పి ప్రధాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖ పరమైన పలు అంశాలపై చర్చించారు.

News April 25, 2024

అన్ని వర్గాలకు వైసీపీ అనుకూలం: బొత్స

image

వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ద్వారక నగర్‌లో విశాఖ హోటల్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థులు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, ఎంవీవీ పాల్గొన్నారు.

News April 25, 2024

గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు ఒక్కరోజే 64 నామినేషన్లు

image

గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం 64 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందజేసిన నామినేషన్ల నియోజకవర్గాల వారీ వివరాలు.. తాడికొండ నియోజకవర్గం 5, మంగళగిరిలో 17, పొన్నూరులో 5, తెనాలిలో 5, ప్రత్తిపాడు లో 20, గుంటూరు పశ్చిమలో 9, గుంటూరు తూర్పులో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News April 25, 2024

కంట్రోల్ రూంను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

గజపతినగరం,నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం ఎన్నికల కంట్రోల్ రూంను, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల లైవ్ కార్యక్రమాలను, మీడియా మానిటరింగ్, ఎంసీసీ, సీ-విజిల్, 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలను తనిఖీ చేశారు.