Andhra Pradesh

News April 25, 2024

శ్రీకాళహస్తిలో ప్రైవేటు వైద్యురాలు సూసైడ్

image

వైద్యురాలు ఉరేసుకుని బలవన్మరణం చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. CI రారాజు కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెందిన ప్రైవేటు వైద్యుడు డా.రాజేశ్‌రెడ్డితో చెన్నైకి చెందిన వైద్యురాలు అశ్విని(35)కి 8ఏళ్ల క్రితం పెళ్లైంది. అశ్విని తనగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 25, 2024

అల్లూరి: గ్యాస్ పొయ్యి లేని గ్రామం 

image

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయితీ కొత్త బొర్రంపేటలో నేటికీ గ్యాస్ సిలిండర్లు వాడరు. 35 కుటుంబాలు నివాసముంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్యాస్ ఎలా వినియోగించాలో తెలియదని, కట్టెలు పొయ్యిలోనే ఆహారం తయారు చేసుకుంటామని వారు చెబుతున్నారు. తరచూ అడవి నుంచి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుంటామని అంటున్నారు.

News April 25, 2024

‘పది’లో జిల్లా టాపర్ ప్రసన్నకు డీఈవో అభినందనలు

image

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన గుడివాడకు చెందిన ఏకేటీపీ  ఎంజీహెచ్ హై స్కూల్ విద్యార్థి అల్లంపల్లి భాను ప్రసన్నను జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా అభినందించారు. మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో ప్రసన్నను ఆమె సత్కరించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రసన్న 590 మార్కులు సాధించారు.

News April 25, 2024

విశాఖలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు మార్పు

image

మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పెందుర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌కు విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్‌ను ఉత్తర ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా నియమించారు.

News April 25, 2024

అల్లవరం: మహిళను హత్య చేసిన నిందితుడు దొరికాడు..!

image

అల్లవరం మండలం రెళ్ళుగడ్డలో వివాహితపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కొంబత్తుల నవీన్ కుమార్ స్థానికులకు దొరికాడు. గురువారం ఉదయం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో బాత్రూమ్‌లో మాటు వేసి మరో మహిళపై హత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం నవీన్ కుమార్‌ను అల్లవరం ఎస్సై హరీష్ కుమార్ కు అప్పగించారు.

News April 25, 2024

కర్నూలు: రానున్న మూడు రోజులు భగ భగలే..!

image

రానున్న రెండు, మూడు రోజుల పాటు 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. బుధవారం మహానందిలో 44.2 డిగ్రీలు, బనగానపల్లె, డోన్‌లో 44.1, కోడుమూరులో 43.9, కర్నూలులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి, గడివేముల, దొర్నిపాడు, రుద్రవరం మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

News April 25, 2024

అనంత: దైవ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

డీ.హీరేహాళ్ మండలం కర్ణాటక సరిహద్దులోని జజిరికల్ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దైవదర్శనం నిమిత్తం మంత్రాలయానికి కారులో ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నందీశ్ అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.

News April 25, 2024

VZM: అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి

image

జామి మండలం కిర్ల గ్రామానికి దండి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగరాజు అట్టాడ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అలమండ హైవే వద్ద బ్రిడ్జ్ సమీపంలో స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 25, 2024

చీమకుర్తి: భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన చోరీ కేసును చేధించినట్లు ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలులో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పమిడి పద్మశ్రీ తన సోదరుడు మృతి చెందడంతో ఈనెల 21న బల్లికురవ వెళ్లారు. తిరిగి వచ్చే సరికి తలుపులు పగులగొట్టి దుండగులు 70 సవర్ల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేశారు.

News April 25, 2024

అవినాశ్ మంచివాడు కాబట్టే టికెట్ ఇచ్చాను: జగన్

image

వైఎస్ అవినాశ్ రెడ్డి మంచివాడు, తప్పు చేయలేదనే నమ్మకం ఉంది కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినాశ్ మా అందరికంటే చిన్న పిల్లవాడని అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి అవినాశ్‌పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అవినాశ్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.