Andhra Pradesh

News April 25, 2024

గాజువాక వైసీపీ అభ్యర్థి ఆస్తి రూ.10.54 కోట్లు

image

➤అభ్యర్థి పేరు: గుడివాడ అమర్ నాథ్
➤ ఆస్తుల మొత్తం : రూ.10.54 కోట్లు
➤ చరాస్తులు మొత్తం: రూ.3.40కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.6.91 కోట్లు
➤ కేసులు: 3
➤ అప్పులు: రూ.93.16 లక్షలు
➤➤2019లో ఆయన కుటుంబం ఆస్తి విలువ రూ.5.10 కోట్లు ఉండేది.

News April 25, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు మొత్తం 142 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి దాదాపు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరిద్దరు మాత్రమే ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.

News April 25, 2024

VZM: ఇంటర్ ఫెయిల్ అయిన వారికి స్పెషల్ క్లాసులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్క‌ర్ గురుకులాల్లో ఇంటర్ తప్పిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. 13 గురుకులాల్లోని ఫస్ట్ ఇయర్, సెకెండియర్ కలిపి 172 మంది ఫెయిలయ్యారని వెల్లడించారు. ఈనెల 24న తరగతులు ప్రారంభించగా.. మే 23 వరకు కొనసాగుతాయన్నారు. బాలురుకు కొప్పెర్లలో, బాలికలకు నెల్లిమర్ల గురుకులంలో వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

News April 25, 2024

పెరిగిన అనిల్ కుమార్ ఆస్తులు

image

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ.4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఒక పోలీస్ కేసు నమోదైంది.

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీని గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

News April 25, 2024

కాకినాడలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

image

స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మునిగి
మృతి చెందిన ఘటన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అనపర్తి శ్రీను (25) కూలి పనులు చేస్తుంటాడు. కొవ్వూరు లాకులు వద్ద కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి మరణించాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

వాకర్స్ తో కలిసి విజయసాయి రెడ్డి ప్రచారం

image

నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూలు మైదానం, ఏసీ సుబ్బారెడ్డి పార్కుల్లో గురువారం ఉదయం వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.

News April 25, 2024

ఏలూరు జిల్లాలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో చూసేయండి

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరో రోజు 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. 18 తేదిన మొదలైన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఏలురు పార్లమెంటు స్థానానికి 5 నామినేషన్లు దాఖలుకాగా.. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 35 నామినేషన్లు దాఖలయ్యాయిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చివరి రోజు గురువారం భారీగా నామినేషన్లు వచ్చే అవకాశలు ఉన్నాయన్నారు.

News April 25, 2024

మెరిసిన విజయవాడ IFS అధికారి

image

విజయవాడకు చెందిన IFS అధికారి అబ్దుల్ రవూఫ్ తెలుగువారి ఖ్యాతిని పెంచారు. సివిల్స్ ప్రిపేర్ అయిన ఇతను మూడో ప్రయత్నంలో IFSకు సెలక్ట్ అయ్యారు. 2022-24 శిక్షణ సమయంలో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి 7 బంగారు పతకాలు సాధించారు. బుధవారం డెహ్రడూన్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీటిని అందుకున్నారు.

News April 25, 2024

గాజువాక టీడీపీ అభ్యర్థిపై మూడు కేసులు

image

గాజువాక TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13కోట్లు,చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్యదేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61,34 లక్షలు. అవిభక్త కుటుంబానికి రూ.20.26 కోట్లున్నాయి. అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై మూడు కేసులున్నాయి.