India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్ తెలిపారు. పి. కోనవలస, భద్రగిరిలో బాలురు, బాలికలు, కురుపాంలో బాలికల కళాశాలలు నడుస్తు న్నాయి. వీటిలో ఎంపీసీలో 200, బైపీసీలో 200 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్నిచోట్ల సీఈసీ, హెచ్ఎసీ గ్రూపులున్నాయని, 40 చొప్పున సీట్లు భర్తీ చేస్తామని పీవో చెప్పారు.
ఈనెల 27న నిర్వహించనున్న పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పాలిసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ కె.నారాయణరావు తెలిపారు. విశాఖ నగరంలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 9,511 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 11 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత, లబ్బీపేటకు చెందిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థిగా పత్రాలను దాఖలు చేశారు. అలాగే మరొక కవి, శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మంగళగిరి నుంచి శాసనసభకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.
విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులు రూ.431.30 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎంవీవీ దంపతులకు చరాస్తులు రూ.340.44కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య పేరుతో 1.2 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరిట రూ.80.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ఆయనకు రూ.18.72 కోట్లు, భార్య పేరుతో రూ.6.6 కోట్లు అప్పు ఉందని అన్నారు. ఆయనపై ఒక కేసు ఉంది.
శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు కలమట సిద్ధమయ్యారు. మంగళవారం చంద్రబాబుతో జరిగిన భేటీతో కలమట వెనక్కి తగ్గారు. చంద్రబాబు ఆదేశానుశారం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
డెంకాడ మండలంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్న సీఎం ప్రజలకు సెంట్ భూమి ఇచ్చాడంటా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రుషి కొండని మింగేస్తే బడ్డుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ అన్నారు. తంగుడుబిల్లిలో సుమారు 10 ఎకరాల కొండని అనుచరులతో అక్రమంగా తవ్వేశారని అన్నారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా వీఎం థామస్ తమ్ముడు వీఎం నిధి నామినేషన్ వేశారు. తొలి జాబితాలోనే టీడీపీ అభ్యర్థిగా థామస్‌ను చంద్రబాబు ప్రకటించారు. ఆయనకే బీఫామ్ ఇచ్చారు. దీంతో థామస్ మంగళవారం నామినేషన్ వేశారు. మతం మారిన ఆయన నామినేషన్ చెల్లదన్న అనుమానంతో తమ్ముడి చేత నామినేషన్ వేయించారు. అలాగే మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పోస్టల్ బ్యాలెట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 26 వరకు సమయం ఉందన్నారు.
CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ల బృందంలో జిల్లాకు చెందిన ఎస్.జై కాంత్‌ను నియమించినట్లు YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొంది. క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాలు ఎలక్షన్ నిబంధనలో వ్యవహరించాల్సిన తీరును కోఆర్డినేటర్లు పరీక్షిస్తారని తెలిపింది. ఈ బృందంలో ఐదుగురు రాష్ట్రస్థాయి సభ్యులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.