Andhra Pradesh

News April 25, 2024

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

image

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. అనంతపురం నార్పల మండలంలోని నాయనపల్లి సమీపంలో తాడిపత్రి -అనంతపురం ప్రధాన రహదారిపై బస్సు ఆపి డ్రైవర్ ఓబుల్ రెడ్డి కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అనంతపురానికి తరలించగా అక్కడ మృతిచెందాడు. విధుల్లో భాగంగా తాడిపత్రి తాడిపత్రి నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

News April 25, 2024

కృష్ణా జిల్లాలో 6వ రోజు 57నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజుకి చేరింది. 6వ రోజైన బుధవారం జిల్లాలో 57 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 06 దాఖలవ్వగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 08, గన్నవరం09, అవనిగడ్డ08, పెడన07, పామర్రు05, పెనమలూరు09, గుడివాడ 05నామినేషన్లు దాఖలైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.  

News April 25, 2024

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టో విడుదల

image

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర బుధవారం విడుదల చేశారు. కుటుంబానికి రూ.లక్ష, యువతులకు మొబైల్ ఫోన్, మహిళలకు కొత్త గ్యాస్ కనెక్షన్, యువకులకు ఉచితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వారికి రూ.2 లక్షల అందజేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించిన 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

News April 25, 2024

స్టీల్ ప్లాంట్: ఉద్యమ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

image

రక్షణ శాఖ మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోరాట కమిటీ సభ్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు వీరు అడ్డు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News April 25, 2024

సత్యసాయి జిల్లాలో 43 మంది నామినేషన్ల దాఖలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 43 మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆరుగురు, మడకశిర నుంచి 10 మంది, హిందూపురం నుంచి నలుగురు, పెనుకొండ నుంచి ఐదుగురు, పుట్టపర్తి నుంచి ఏడుగురు, ధర్మవరం నుంచి 8 మంది, కదిరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని పేర్కొన్నారు.

News April 25, 2024

నరసాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా బ్రహ్మనందరావు

image

నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడును ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు ఏపీసీసీ అధ్యక్షురాలు YS.షర్మిల బుధవారం బీఫాం అందజేశారు. కాగా ఆయన రేపు నామినేషన్ వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. 

News April 25, 2024

పిఠాపురం: 1989 నుంచి 2వ సారి ఎవ్వరూ గెలవలేదు

image

ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన పిఠాపురం ఓటర్లు ఎన్నికల్లో విభిన్న తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఒక్క అభ్యర్థీ 2వసారి గెలిచిన దాఖలాలు లేవు. అయితే రానున్న ఎన్నికల్లో కొత్తగా పొటీచేస్తున్న పవన్ గెలుస్తారా లేదా సెంటిమెంట్‌కు భిన్నంగా 2009లో విజయం సాధించిన వంగా గీతకు మరోసారి పట్టంకడతారా అనేది ఆసక్తిగా మారింది. – మీ కామెంట్..? 

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

News April 25, 2024

నూజివీడులో భార్యపై భర్త దాడి 

image

కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని తుక్కులూరు గ్రామానికి చెందిన వివాహితపై భర్త బుధవారం కర్రతో దాడి చేశాడు. గ్రామానికి చెందిన పండు, బాధితురాలు ఝాన్సీతో ఏడు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. తన భర్త మద్యం మత్తులో తనపై పలుమార్లు దాడి చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

కంభం మండలంలో ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

కంభం మండలంలోని ఎర్రబాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలోని నాగయ్య(60) మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.