Andhra Pradesh

News April 25, 2024

నెల్లూరు: 9 గంటల నుంచే ఓపీ సేవలు

image

నెల్లూరులోని జీజీహెచ్ లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఓపీతో పాటు సర్జరీలు, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచాలన్నారు. జీజీహెచ్ లోని అన్ని విభాగాల అధికారులతో ఆయన ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.

News April 25, 2024

ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు

image

పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్ల కాలంలో ఆయనపై 13 కేసులు నమోదయ్యాయి. పుల్లారావు పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు రూ.15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

కెమెరాలు చూస్తున్నాయ్.. జాగ్రత్త!

image

NLR: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా నిబంధనల ఉల్లంఘనుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు బిగించిన వాహనాలు కూడా రోడ్డెక్కాయి. ఈసీ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం డేగ కళ్లతో వేటాడుతున్నాయి.

News April 25, 2024

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేషన్లు వేసేది వీళ్లే..

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్, ప్రత్తిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు, గురజాల వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. 

News April 25, 2024

REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

image

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు

News April 25, 2024

నేటి నుంచి ద్రాక్షారామ ఆలయం మూసివేత

image

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో బుధవారం నుంచి గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తున్నారు. శివలింగంపై గుంటలు పడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో శివలింగానికి రసాయనాలు పూసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆలయాన్ని మూసి ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు.

News April 25, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

News April 25, 2024

చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చిత్తూరు పార్లమెంట్‌కు 4, శాసనసభకు 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గంగాధర్ నెల్లూరు నుంచి థామస్, నగరి నుంచి గాలి భానుప్రకాశ్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, కుప్పం నుంచి భరత్ నామినేషన్ వేశారు.

News April 25, 2024

ఆర్చరీలో మెరిసిన వెన్నం జ్యోతి సురేఖ

image

విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తా చాటింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న పోటీలో మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ రెండో స్థానంలో నిలిచింది. సురేఖ, అదితి, పర్‌ణీత్‌లతో కూడిన భారత జట్టు(2118) టీమ్ విభాగం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు, మిక్స్‌డ్ టీమ్‌లో సురేఖ- అభిషేక్ (1419) జోడీ రెండో స్థానంలో నిలిచింది.

News April 25, 2024

ప.గో: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

నెల్లూరు జిల్లా కావలి- ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కొయ్యలగూడెం వాసులు మృతి చెందారు. ఒక లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వస్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతులు జ్యోతి కళ్యాణి, రాజీ, కుమార్‌లుగా గుర్తించారు.