India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు తెల్లవారుజామున 4.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రైలు రాక ఆలస్యం వలన 7 గంటలు ఆలస్యంగా 11.20 గంటలకు విశాఖలో బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీని గమనించి ప్రధానంగా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సత్తిబాబు (35) మృతదేహం హైవేపై లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకొని, ఓటర్ చైతన్యం, హోమో ఓటింగ్ విధానం అంశాలపై ఆయన ఈరోజు ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పుంగనూరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చౌడేపల్లె మండలం అమినిగుంటలో సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో మానసిక, శారీరక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది. క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
➤ పలాస: CPI- కామేశ్వరరావు
➤ ఇచ్ఛాపురం: BSP- వేదవర బైసాయి
➤ టెక్కలి: BSP- శ్రీనివాసరావు,
➤శ్రీకాకుళం: PPI-లక్ష్మణ
➤ ఆమదాలవలస: PPI-మధుసూదనరావు
➤ పాతపట్నం:INCP- వెంకట్‌రావు, స్వతంత్ర – మోహనరావు, JBNP- తిరుపతిరావు, కృష్ణ- స్వతంత్ర అభ్యర్థి, GDP- సంజీవరావు
➤ ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి, రమ్య సువ్వారు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది.
క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆస్పరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోతి సతీశ్(25) స్ఠానిక రైల్వే స్టేషన్ సమీపాన రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
మే 5 నుండి 8 తేదీల్లో నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.