India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళ మృతి చెందిన ఘటనపై మంగళవారం పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని నుంచి గుంటూరు వెళ్ళు హైవే రోడ్డుపైన గుర్తు తెలియని మహిళ పడి ఉందని గుర్తించారు. మతిస్థిమితం లేని ఆమెను గుంటూరు GGHకు తరలించారు. ఆమె పేరు లావణ్య అని చెప్పినట్లు సమాచారం. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.
ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేశారు. ముందుగా ఏలూరు నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలుతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి 27 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి 8 మంది, పుట్టపర్తి నుంచి ఐదుగురు, మడకశిర నుంచి ఐదుగురు, హిందూపురం నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ముగ్గురు, కదిరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో కూటమి విజయం సాధిస్తుందని తెలుగు మహిళా జిల్లాధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన ఆమెను భీమవరం పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఉన్నారు.
➤ఆత్మకూరు: మేకపాటి విక్రమ్ రెడ్డి (YCP)
➤ విక్రమ్ ఆస్తి: రూ.191.33 కోట్లు
➤ భార్య వైష్ణవి ఆస్తి: రూ.17.82 కోట్లు
➤ అప్పులు: రూ.32.64 కోట్లు
➤ విక్రమ్ క్రెడిట్ కార్డ్ బిల్లు: రూ.3 లక్షలు,
➤ భార్య క్రెడిట్ కార్డు రూ.7.50 లక్షలు
➤ వాహనాలు, బంగారం: లేదు
➤ కేసులు: 8
NOTE: నెల్లూరుతో పాటు హైదరాబాద్‌లో కమర్షియల్ స్థలాలు, భవనాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: రఘురామకృష్ణ (TDP)
➤ చరాస్తులు: రూ.13,69,80,134
➤ స్థిరాస్తులు: రూ. 11,86,86,250
➤ అప్పులు: రూ.8,15,28,587
➤ భార్య చరాస్తులు: రూ.17,75,30,245
➤ భార్య స్థిరాస్తులు: రూ.175,45,16,634
➤ భార్య అప్పులు: రూ.4,45,15,536
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.38,00,884
➤ వాహనాలు: RRRకు 1 (గోల్ఫ్ కార్), ఆయన భార్యకు 3 కార్లు.
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.
పదో తరగతి ఫలితాల్లో చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన నవీన అనే విద్యార్థిని 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా ఇవే అత్యధిక మార్కులు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నవీన వారంలో 3 రోజులు కూలీ పనులకు, మరో 3 రోజులు పాఠశాలకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. నవీన తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమె తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.
చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి SST బృందాలతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఎస్.ఎస్.టి బృందాలు నిర్వహించే విధులు కీలకమని తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో ఐఏఎస్ అధికారిణిని బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారిని బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.
Sorry, no posts matched your criteria.