India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీ లత తెలిపారు. లోక్ సభకు 4, అసెంబ్లీలకు 20 దాఖలయ్యాయని అన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా సోమవారం వరకూ లోక్ సభకు 5 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 48 దాఖలయ్యాయి.
విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే అవకాశం లేనివారు హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారు, , నడవలేని స్థితిలో ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోగా పరిధిలోని ఆర్వోకు అందించాలని తెలిపారు.
ఆనంతపురం జిల్లాలో వ్యాపార, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు మే13న పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్ లక్ష్మినరసయ్య తెలిపారు. యాజమాన్యాలు ఆ రోజు సెలవు పాటించాలని తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు మంజూరు చెయ్యని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టెక్కలి అసెంబ్లి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలను సోమవారం నామినేషన్ నేపథ్యంలో అఫిడవిట్‌లో పొందుపరిచారు. స్థిరాస్తులు: రూ.2,31,48,500 ఉండగా, చరాస్తులు: రూ. 1,32,05,511 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు: రూ.42,90,153, చేతిలో నగదు: రూ. 2,50,000, వివిధ బ్యాంకుల్లో: రూ.64,18,869 ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
మదనపల్లె స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమాదేవి నామినేషన్ దాఖలుచేశారు. పట్టణంలోని రామగోపాల్ నాయుడు వీధికి చెందిన ఆమె బజ్జీల వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఆమె సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మహిళల పక్షాన అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని చెప్పారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.
సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. విశాఖలోని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సా. 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.
సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.