India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం నగరానికి చెందిన టి.ప్రణతి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 598 మార్కులతో సత్తా చాటి రాష్ట్ర టాపర్లలో ఒకరిగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టాలు అభినందించారు.
కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.
ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.
➤ నియోజకవర్గం: కమలాపురం
➤ అభ్యర్థి: పి. రవీంద్రనాథ్ రెడ్డి
➤ చరాస్తి విలువ: రూ.21,66,41,321
➤ స్థిరాస్తి విలువ: రూ.14,07,41,368
➤ అప్పులు: రూ.20,02,58,264
➤ కేసులు: 3
NOTE: అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం.. దంపతులు ఇద్దరికి కలిపి ఉన్న ఆస్తి వివరాలు
నెల్లూరు జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. నాలుగో రోజు సోమవారం ఒక్కరోజే దాదాపు 30 నామినేషన్లను స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్‌లో ఆదాల, సిటీలో నారాయణ, సర్వేపల్లిలో కాకాణి, ఆత్మకూరులో ఆనం, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ నామినేషన్లు దాఖలు చేశారు.
చిత్తూరు జిల్లాలో సోమవారం 44 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 5, పుంగనూరు అసెంబ్లీకి 5, నగిరికి ఒకటి, చిత్తూరుకు నాలుగు, పూతలపట్టుకు 6, పలమనేరుకు ఆరు, కుప్పం అసెంబ్లీకి ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.
విభిన్న ప్రతిభావంతుల స్టేట్ ఇంటర్ జోన్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీతను అంధుల క్రికెటర్ వలసనేని రవని కలిశారు. ఆల్ ఇంగ్లాండ్ అంధుల క్రికెట్ ప్రపంచ పోటీలలో గెలిచిన టీంలో ఈమె సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ రౌండ్ ప్రతిభతో 2023లో బంగారు పతకం సాధించారు. రవని కుటుంబ సభ్యులు పరిస్థితులు, మెరుగైన క్రికెట్ ఆడేందుకు అవసరమైన సాయం చేయాలని విన్నవించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఓట్లు వేసేందుకు యువతను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు.
ప్రజల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని మంత్రి అంజాద్ బాష అన్నారు. సోమవారం సాయంత్రం కడప నగరంలోని 26వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించారు. మరోసారి కడప ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
26వ తేదీలోగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను అందజేయాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పని చేసే చోట ఫామ్-12ను సమర్పించే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.