Andhra Pradesh

News September 22, 2025

ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

image

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

News September 22, 2025

4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై జరిగిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సీజన్‌లో మొత్తం 5.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని తెలిపారు.

News September 22, 2025

పెంచలకోనలో ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

image

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.

News September 22, 2025

నన్నయ యూనివర్సిటీ, నాందీ ఫౌండేషన్‌ల మధ్య ఒప్పందం

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ – నాందీ ఫౌండేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి స్వామి, నాందీ ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. నాందీ ఫౌండేషన్‌తో ఎంఓయూ చేసుకున్న తొలి వర్సిటీ గా ‘నన్నయ’ వర్సిటీ నిలుస్తుందన్నారు.

News September 22, 2025

540 అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా డాక్టర్ల అసోసియేషన్ సోమవారం కలెక్టర్ చేకూరి కీర్తికి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గురువారం నుంచి సమ్మెకు దిగుతామని వినతిపత్రంలో హెచ్చరించారు.

News September 22, 2025

కలెక్టర్ PGRSకు 240 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 240 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 106 వినతులు వచ్చాయి. పంచాయతిశాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 28 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, జేసీ సేదు మాధవన్ స్వీకరించారు.

News September 22, 2025

జిల్లా జడ్జిని కలిసిన SP తుషార్ డూడీ

image

చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడీ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు బొకే అందజేశారు. అనంతరం జిల్లా న్యాయవ్యవస్థ, చట్ట అమలు వ్యవహారాలపై చర్చించారు. చిత్తూరులో శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేస్తామని ఎస్పీ తెలిపారు.

News September 22, 2025

చిత్తూరు కలెక్టర్‌కు 348 అర్జీలు

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 348 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన సమస్యలను ఆయన స్వయంగా విని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.