India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నామినేషన్ల సందడి కొనసాగనుంది. శుభ ముహూర్తం ఉండటంతో నెల్లూరులో నారాయణ, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, గూడూరులో పాశం సునీల్ కుమార్, ఉదయగిరిలో కాకర్ల సురేశ్‌తో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు బందోబస్తు విషయంలో అప్రమత్తమయ్యారు.
ప.గో జిల్లాలో 27,426 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా.. వారందరూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 14,624 మంది బాలురు, 12,802 మంది బాలికలు కలిపి మొత్తం 27,426 మంది విద్యార్థులు 127 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు రాశారు. గతేడాది జిల్లాలో 65.93 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేసిందని అధికారులు తెలిపారు.
నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా 100 ప్రత్యేక బస్సులను పలు ముఖ్యప్రాంతాల నుంచి రూట్ల వారీగా కేటాయించామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 10, బద్వేలు 20, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 20 బస్సులు నడుపుతున్నామన్నారు. ఇక రాజంపేట 30, రాయచోటి 10 ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిండ్రలో 42.6, పులిచెర్లలో 42.4 పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తవణంపల్లె 41.7, గుడుపల్లె 41.7, పెద్దపంజాణి 41.5, శ్రీరంగరాజపురం 41.4, గుడిపాల 41.2, పుంగనూరు 41.2, సదుం, బంగారుపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రి వేళల్లోనూ 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.
కడప జిల్లాలో ప్రమాదవశాత్తు షేక్షావలి (38) అనే డ్రైవర్ మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన షేక్షావలి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ మరమ్మతులు చేసుకుంటుండగా ఆదివారం లారీపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆదోని నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిచారు. 1952లో మెుదటిసారి జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థి హెచ్.రామలింగారెడ్డి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మల్లయ్యపై 5561 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1962లో సీతారామరెడ్డి(ఇండిపెండెంట్).. తిమ్మారెడ్డి(కాంగ్రెస్)పై 4770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.
బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలు కాగా కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స మార్కాపురం తరలించారు. గిద్దలూరు మండలంలో పెళ్లికి హాజరై తిరిగి మార్కాపురానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.