India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీఫాంలు అందజేశారు. మదనపల్లెలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో భరత్(కుప్పం), వెంకటే గౌడ(పలమనేరు), డాక్టర్ సునీల్(పూతలపట్టు), రెడ్డెప్ప(చిత్తూరు ఎంపీ) వీటిని అందుకున్నారు. అందరూ కష్టపడి పనిచేసి గెలవాలని పెద్దిరెడ్డి సూచించారు.
బీజేపీ – జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీకాంత్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు వైసీపీలో చేరారు. నెల్లూరు రామ్మూర్తినగర్ లోని వీఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పోస్టల్ బ్యాలట్ హెల్ప్ డెస్క్
1.నరసరావుపేట-14 సామ్రాజ్యం, శ్రావ్య 6281073020, 9490309630
2 పెదకూరపాడు-85 నహ్మతుల్లా, టైపిస్ట్ 6300909696
3 చిలకలూరిపేట-96 వరప్రసాద్, MRO 9949096532
4 నరసరావుపేట-97 వి శ్రీనివాసరావు, ఏఓ 9985744342
5 సత్తెనపల్లి-98 లక్ష్మీ నర్సింహ, MRO 9949098622
6 వినుకొండ-99 నాగరాజు, DT 6300823885
7 గురజాల-100 రామాంజనేయులు, SA 8247055270
8 మాచర్ల-101 K చంద్రశేఖర్, MRO 7032929348
రొళ్ల మండల రంగాపురం క్రాస్ అలుపునపల్లి సమీపంలో బైక్‌లో ఇద్దరు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన వారికిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరొచ్చింది. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
ప్రకాశం జిల్లా TDP అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీ-ఫారంలు అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని TDP అభ్యర్థులకు ఒంగోలు-జనార్ధన్, మార్కాపురం-కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు-అశోక్ రెడ్డి, కనిగిరి-ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి-గొట్టిపాటి లక్ష్మి, కొండపి-డోలా బాల వీరాంజనేయ స్వామి. వైపాలెం-గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంటకు అందజేశారు.
బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు SI జ్యోతిబసు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బాలిక(10) ఈ నెల 19న పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఎవరూ లేరని తెలుసుకుని పట్టణానికి చెందిన అంజత్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. తల్లికి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు ఆస్తి వివరాలు చూస్తే సామాన్యుడే అని అన్నట్లుగా అనిపిస్తుంది. కెనరా బ్యాంకులో ఉన్న అకౌంట్లో రూ.1000, మైలవరం మండల పుల్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూ.9,823 ఉన్నట్లు చూపించారు. తన పేరుతో రూ.73,531 విలువైన 2016 మోడల్ బైకు, రూ.55,200 విలువైన 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంగా రూ.50 వేలు ఉన్నట్లు పొందుపరిచారు.
ఉండి కూటమి అభ్యర్థిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ నేటితో వీడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామ కృష్ణ రాజును ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో ముగ్గురు రాజుల మధ్య పోటీ నెలకొననుంది. రఘురామ కృష్ణరాజు కూటమి నుంచి, వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు, స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకటశివరామరాజు నిలిచారు. మరి గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే..?
దర్శి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. నాదెండ్ల బ్రహ్మం ప్రమాదంలో గాయపడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఫోన్లో వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. బ్రహ్మంకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.