Andhra Pradesh

News April 21, 2024

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి ఆస్తుల వివరాలు

image

☞ విద్యార్హతలు: B.A (Literature)
☞ భర్త: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
☞ కేసులు, వ్యవసాయ భూమి, వాహనం లేవు.
☞ చరాస్తులు: రూ.11.75కోట్లు (కుటుంబీకులందరివి కలిపి)
☞ స్థిరాస్తులు: రూ.49.70 కోట్లు (కుటుంబీకులందరివి)
☞ బంగారం: 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10గ్రా ముత్యాలు (రూ.1.19 కోట్లు).
☞ HYD బంజారాహిల్స్‌‌లో ఇల్లు(రూ.5.55 కోట్లు).
☞ అప్పులు: రూ.6.73 కోట్లు.
➠ తాజా అఫిడవిట్ వివరాల ప్రకారం

News April 21, 2024

బగ్గు రమణమూర్తి ఆస్తులివే..

image

*అభ్యర్థి పేరు: బగ్గు రమణమూర్తి
*నియోజకవర్గం:నరసన్నపేట
*పార్టీ: టీడీపీ
*కేసులు: లేవు
*చరాస్తులు: రూ.2.38 కోట్లు
*స్థిరాస్తులు: రూ.64.09 కోట్లు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.3.50కోట్లు
*రుణాలు:రూ.63.25 లక్షలు
NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 21, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

ఏలూరు నుంచి కర్నూలుకు వస్తున్న క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనం గిద్దలూరు ఘాట్ రోడ్ బొగద మలుపు వద్ద ఆదివారం తెల్లవారుజామున కొండచరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఏలూరు నుంచి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండచరియను ఢీకొంది. ఆ సమయంలో డ్రైవర్ పెద్దరాజు కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు.

News April 21, 2024

నెల్లూరు: సచివాలయంలో మద్యం సీసాలు

image

నెల్లూరు జిల్లాలోని ఓ సచివాలయంలోనే మద్యం సీసాలు దొరకడం కలకలం రేపుతోంది. కావలి పట్టణ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు నిల్వ చేసినట్లు సీ-విజిల్ యాప్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సచివాలయంలో తనిఖీలు చేశారు. 43 మద్యం సీసాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

తంబళ్లపల్లెపై వీడని సస్పెన్స్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫాంలు అందజేశారు. ముందు రోజు ఇచ్చిన సమాచారంతో అభ్యర్థులంతా మంగళగిరికి చేరుకున్నారు. చంద్రబాబు మినహాయిస్తే చిత్తూరు జిల్లాలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రా రెడ్డికి బీఫాం ఇవ్వలేదు. ఇక్కడ అభ్యర్థిని మార్చడం లేదా బీజేపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీపాం ఇవ్వకుండా ఆపారు.

News April 21, 2024

మంగళగిరి: తండ్రి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న తనయుడు

image

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన బీ ఫామ్ల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్న నారా లోకేశ్ టీడీపీ అధినేత, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తండ్రి చంద్రబాబు కాళ్ళు మొక్కి నారా లోకేశ్ ఆశీర్వాదం తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News April 21, 2024

అనంత: అభ్యర్థులకు భీఫాంలు అందించిన చంద్రబాబు

image

అనంతపురం జిల్లాలో టీడీపీ తరుఫున ఎన్నికల బరిలో నిలలిచిన అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్‌ అందించారు. వారిలో బండారు శ్రావణి (శింగనమల), దగ్గుపాటి ప్రసాద్ (అనంతపురం), గుమ్మనురు జయరాం (గుంతకల్), అమిలినేని సురేంద్ర బాబు (కల్యాణ దుర్గం), అంబికా లక్మి నారాయణ (అనంతపురం ఎంపీ అభ్యర్థి) చంద్రబాబు చేతుల మీదగా బీఫాం అందుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశ నిర్దేశం చేశారు.

News April 21, 2024

శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు భీపామ్‌లు అందించిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థులకు భీపామ్‌లు అందించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ (శ్రీకాకుళం), గౌతు శీరిష (పలాస), బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), కూన రవికుమార్(ఆమదాలవలస), అచ్చెన్నాయుడు (టెక్కలి), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట) భీపామ్‌లు అందుకున్నారు.

News April 21, 2024

ఉండి టీడీపీ కంచుకోట.. గెలిచి తీరుతా: RRR

image

ఉండిలో ఎంతమంది అడ్డొచ్చినా MLAగా గెలిచి తీరుతానని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతులమీదుగా ఉండి అభ్యర్థిగా బీఫాం అందుకున్న రఘురామ.. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ఉండిలో మంతెన రామరాజుతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. ఉండి టీడీపీ కంచుకోట అని, టీడీపీ-జనసేన్-బీజేపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లి జెండా ఎగురవేస్తానని అన్నారు.

News April 21, 2024

కాకినాడ: ఎన్నికల ప్రచారంలో నేతకు గాయాలు

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్ర నేత కంటే వీరరాఘవరావు తీవ్ర గాయాలకు గురయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు శనివారం రాత్రి సామర్లకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. బాణాసంచా పేల్చుతూ, తారాజువ్వలు వేశారు. కంటే వీరరాఘవరావు తలపై ఒక తారాజువ్వ పడటంతో అతడికి గాయాలయ్యాయి. నాయకులు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.