Andhra Pradesh

News April 20, 2024

శ్రీకాకుళం: 29 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News April 20, 2024

పిడుగుపాటుకు 3 ఎద్దులు మృతి

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బాషా అనే రైతుకు చెందిన రెండు ఎద్దులను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కలుగొట్ల గ్రామంలో సైతం ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది.

News April 20, 2024

చిత్తూరు: నేటి నామినేషన్ల వివరాలు

image

మూడవరోజు శనివారం జిల్లాలో నామినేషన్ల దాఖలు వివరాలను అధికారులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ వచ్చినట్టు చెప్పారు. నగిరి, పూతలపట్టు కు ఒక్కో నామినేషన్ వచ్చిందన్నారు. జీడి నెల్లూరుకు రెండు, పలమనేరుకు రెండు నామినేషన్లు వచ్చాయన్నారు. కుప్పం, పుంగనూరులో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు.

News April 20, 2024

మూడో రోజు 14 నామినేషన్లు దాఖలు: కలెక్టర్

image

రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 3వ రోజు హిందూపురం పార్లమెంటుకు సంబంధించి 4 సెట్లు నామినేషన్ దాఖలు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు.

News April 20, 2024

శ్రీ సత్యసాయి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

ధర్మవరం పట్టణం డీఎల్ఆర్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

News April 20, 2024

తిరుపతి గంగమ్మ జాతర తేదీల మార్పు

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణ తేదీలు మారాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 7వ తేదీ నుంచి 15 వరకు జరగాల్సి ఉంది. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంది. అదే సమయంలో జాతర నిర్వహిస్తే బందోబస్తు సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంతో 14వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు జాతర చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

News April 20, 2024

రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

image

సీఎం జగన్ బస్సు యాత్ర ఆదివారం విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో సాగనుంది. ఆదివారం ఉ.9 గంటలకు చిన్నయ్య పాలెం రాత్రి బస నుంచి బయలుదేరి పినగాడి , లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడ చేరుకుని రాత్రి బస చేస్తారు.

News April 20, 2024

మార్కాపురం: మరో జంట ఆత్మహత్య

image

మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో మరో ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతులు నారు వెంకట నాగేశ్వరి, జక్కుల గోపిగా స్థానికులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం యువతికి మరొకరితో వివాహం జరుగనుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గోపి అదే గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

News April 20, 2024

గరివిడి: వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య 

image

గరివిడి మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన అప్పన్న(30) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేని భార్య దేవి, మామ సన్యాసిరావుతో కలిసి భర్తను ఉరి వేసి చంపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 20, 2024

పాలకొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పాలకొండ మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అంపిలి గ్రామానికి చెందిన అప్పలనాయుడు (58) తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి, కరెంట్ షాక్‌తో  మృతి చెందాడని ఏఎస్ఐ రాజారావు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.