India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని కాకాణి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో టీడీపీ నేతలతో జనసేన అధినేత పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం TDP ఇన్‌ఛార్జి వర్మ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని.. ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే మద్దతిచ్చానని తెలిపారు. నేడు సాయంత్రం కోరుకొండ సభలో ఆయన పాల్గొననున్న విషయం తెలిసిందే.
రాజమండ్రికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈ నెల 21న జరగనుంది. కాగా వారి వివాహ వేడుకకు ఆహ్వానపత్రికను వినూత్నంగా సిద్ధం చేశారు. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలు, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. పత్రి ఘట్టానికి ఓ క్యూఆర్ కోడ్ రూపొందించి శుభలేఖలో ముద్రణ చేయించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని ఎవరైనా చూడొచ్చు.
– మీరు చూశారా ఇలాంటివి.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాల వివరాలను ఖచ్చితంగా లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, అందువలన వాటిపై ఏఈఓలకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.
బేతంచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండా గోపాల్ మనుమడు గుండా ఆయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 4వ తరగతి చదువుతున్న ఆయాన్ 100 నుంచి ఒకటి వరకు వెనక వైపు నుంచి అంకెలను 37 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను వారం రోజుల పాటు మార్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరను నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఇబ్బందులు లేకుండా అవిలాల జాతర ఆలస్యం కావడంతో మే 14 నుంచి 22వ తేదీకి మార్చారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి ఇలా జరగడం.
ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్, ఎన్నికల పరిశీలకులు కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలతో కలసి నూతన కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా ఎక్స్పెండిచర్ కమిటీ, కంప్లైంట్స్, రిపోర్టింగ్, మీడియా సెంటర్ విభాగాలను పరిశీలించారు.
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గణపతి నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లారు. ఎమ్మెల్యేకు వడదెబ్బ తగిలినట్టు వైద్యాధికారిణి పి. అనూష తెలిపారు. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కించినట్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు సంవత్సరాల B.A, B.Edలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.
పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి బీఫామ్ అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు.
Sorry, no posts matched your criteria.