Andhra Pradesh

News April 20, 2024

కుంభోత్సవం సందర్భంగా జీవహింస పూర్తిగా నిషేధం: ఈవో పెద్దిరాజు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం సందర్భంగా జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధమని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈమేరకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం తరపున పూర్తి సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సున్నిపెంటలో రెండు రోజులు పాటు మద్యం షాపుల బంద్‌కు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు.

News April 20, 2024

శ్రీకాకుళం: ప్రచార ఖర్చులపై నిరంతర నిఘా

image

ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నంలో నగదు, బహుమతుల పంపిణీపై సీ- విజిల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

News April 20, 2024

వేగేశన నరేంద్ర వర్మ ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: బాపట్ల
➤ అభ్యర్థి: వేగేశన నరేంద్ర వర్మ రాజు(TDP)
 ➤ భార్య: హరికుమారి
 ➤ విద్యార్హతలు: 10వ తరగతి
 ➤ చరాస్తి విలువ: రూ.73.72 కోట్లు
 ➤ స్థిరాస్తి విలువ:రూ.22.59 కోట్లు
 ➤ కేసులు: 2
 ➤ అప్పులు: రూ.25.91 కోట్లు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.10.67 లక్షలు
 ➤ బంగారం: తన వద్ద రూ.27లక్షలు, భార్య వద్ద రూ.47లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 20, 2024

ఒంటిమిట్ట రామదాసు ఈయనే

image

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.

News April 20, 2024

TPT: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో ప్రాజెక్టు అసోసియేట్ – 01 పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ (M.Sc) బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 02.

News April 20, 2024

కర్నూలు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

image

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీనడంతో మహిళ మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కర్నూలు బృందావన్ కాలనీకి చెందిన తల్లీకూతురు మాలతి, మౌలిక ఓ ఎలక్ట్రికల్ కారు అద్దెకి తీసుకొని HYDకి వచ్చారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై హమీదుల్లానగర్ శివారులో ప్రమాదం జరిగింది. మాలతి మృతి చెందగా.. మౌలిక, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2024

మార్కాపురం: అక్రమ సంబంధం.. ఇద్దరూ సూసైడ్

image

మార్కాపురం మండలం చింతకుంట గ్రామ శివారులో ఓ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతులు పెద్దారవీడు మండలం పుచ్చకాయ పల్లి గ్రామానికి చెందిన వివాహిత విజయలక్ష్మి(40), సత్యనారాయణ రెడ్డి (30)గా స్థానికులు గుర్తించారు. ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో ఇరు కుటుంబాలు వారు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

News April 20, 2024

పేరాడ తిలక్‌ ఆస్తుల వివరాలు ఇవే..

image

*నియోజకవర్గం: శ్రీకాకుళం పార్లమెంట్
*పార్టీ: వైసీపీ
*విద్యార్హత:డిగ్రీ
*కేసులు: ఏమీలేవు
*చరాస్తులు: రూ.51.47లక్షలు
*స్థిరాస్తులు: రూ.65.87లక్షలు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.9.30కోట్లు
*రుణాలు: రూ.34.51 లక్షలు
*NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 20, 2024

నందిగం సురేశ్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ పార్లమెంట్: బాపట్ల
➤ అభ్యర్థి: నందిగం సురేశ్ (YCP)
 ➤ భార్య: బేబీలత
 ➤ విద్యార్హతలు: 9వ తరగతి
 ➤ చరాస్తి విలువ: రూ.68.48 లక్షలు
 ➤ స్థిరాస్తి విలువ: రూ.2 లక్షలు
 ➤ కేసులు: 4
 ➤ అప్పులు: రూ.77.05 లక్షలు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.6 లక్షలు
 ➤ బంగారం: 150 గ్రాములు, భార్యకు 450 గ్రాములు
 NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 20, 2024

అనుమానం.. భార్య, పిల్లలను లోపల వేసి ఇంటికి నిప్పు

image

అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.