India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడూరు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు మర్రిపల్లిలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.30 గంటల వరకు గేటు సెంటర్ లో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు మర్రిపల్లి హెలిపాడ్ నుంచి సత్యవేడుకు బయలుదేరుతారు.
శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ వేయలేదు. ఇక శ్రీకాకుళం స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. జిల్లాలో 8 స్థానాలు ఉంటే నాలుగుస్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు కాగా.. అందులో 6 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగిలిన నాలుగింటిలో ఒక్క నామినేషన్ కూడా పడలేదు.
➤ నియోజకవర్గం: ఎమ్మిగనూరు
➤ అభ్యర్థి: బీవీ జయనాగేశ్వరరెడ్డి ( టీడీపీ)
➤చరాస్తుల విలువ : రూ.1.42 కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.3.85 కోట్లు
➤బంగారం : 200 గ్రాములు
➤పొలాలు: 22.97 ఎకరాలు
➤ కేసులు:3
➤ అప్పులు: రూ.77.82 లక్షలు
జిల్లాలోని దర్శి YCP MLA అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన సతీమణి నందిని రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరికి కలిపి రూ.29.3 కోట్ల మేర ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపర్చారు. ఇక చరాస్తుల విలువ సుమారు రూ.10.66 కోట్లు, రూ.45 లక్షలు విలువ గల బంగారం, ఒక బీఎండబ్ల్యూ, ఇన్నోవా, రూ.45 లక్షల మీని కూపర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిపై ఎటువంటి కేసులు లేవని వివరించారు.
➤ నియోజకవర్గం: వెంకటగిరి
➤ అభ్యర్థి: నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (YCP)
➤ ఆస్తుల విలువ: రూ.52.96 కోట్లు
➤ భార్య స్వప్న ఆస్తి: రూ.12.28 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.18 లక్షలు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.2.40 లక్షలు
➤ బంగారం: లేదు, భార్యకు 1.86 కేజీలు
➤ వాహనాలు: రెండు కార్లు
NOTE: HYD సోమాజిగూడలోని ఓ ఇల్లు విలువే రూ.17.50 కోట్లుగా తన అఫిడవిట్‌లో చూపారు.
నంద్యాల పట్టణంలో ఈనెల 21వ తేదీన వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు.
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946వ సంవత్సరంలో స్థాపించబడింది. అనంతరం 2008 సంవత్సరంలో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. కాగా ఈ యూనివర్శిటీ నేటితో 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడంతో శుక్రవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, DRDO మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి వంటి వారు ఇక్కడే చదువుకున్నారు.
గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున, ఈనెల 30వ తేదీన పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. మరమ్మతుల వల్ల గుంటూరు-మాచర్ల, మాచర్ల- నడికుడి సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పగిడిపల్లి, కాజీపేట, కొండపల్లి, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో వెళ్తుందని తెలిపారు.
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కే.ఆర్ గురువారం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తనకు ఓటు వేయమని తిరుపతి ప్రజలను కోరారు. విజయ్ కుమార్ 2013 నుంచి 2015 వరకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా, ప్లానింగ్ సెక్రటరీగా సేవలందించారు.
సీఎం జగన్ బస్సుయాత్ర శుక్రవారం ఉదయం 9గంటలకు ఎస్టీ రాజపురం నుంచి బయలుదేరుతుంది. రంగంపేట మీదుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రవేశించి, పెద్దాపురం-సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడినుంచి సాయంత్రం 3:30గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత పిఠాపురం, గొల్లప్రోలు మీదుగా గొడిచర్లక్రాస్ వద్ద రాత్రికి బస చేస్తారు.
Sorry, no posts matched your criteria.