India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థికంగా అంతంత మాత్రమే నని సీఎం జగన్ ఓ సభలో అన్నారు. అయితే ఆమె అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తి వివరాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమె భర్త శివ నీలకంఠ పేరిట చరాస్తులు రూ.141.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.7.82 కోట్లు ఉన్నాయి. కాగా 2014లో వీరి ఆస్తుల విలువ రూ. 242.60 కోట్లు ఉండేది.
గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 25న రాతపరీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత హాల్ టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8వ తరగతులకు 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయితీ ఊడికలపాడులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబకలహాలతో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఆయన భార్య పద్మావతితో కలిపి స్థిర, చరాస్తుల విలువ రూ.11,25,32,036 గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈయనకు వివిధ వ్యాపారాలపై 2022-23లో రూ.4,37,980, ఆయన భార్యకు రూ.6,09,320 వచ్చింది.
లంచం తీసుకుంటూ జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తెనాలి పట్టణంలో జరిగింది. తెనాలి పట్టణంలోని అమరావతి కాలనీలో ఉన్న ఉడా ఆఫీసులో సిఆర్‌డిఏ ప్లాన్ అమలు చేయడానికి జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు ధరలు గురువారం పుంజుకున్నాయి. A-గ్రేడ్ ధరలు గురువారం కిలో రూ.250 మార్క్‌ను క్రాస్ చేసింది. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో గరిష్ఠ ధర రూ.255, జంగారెడ్డిగూడెం కేంద్రం-1లో రూ.257, జంగారెడ్డిగూడెం కేంద్రం-2లో రూ.251, కొయ్యలగూడెంలో రూ.255, గోపాలపురంలో రూ.254 ధర పలికింది.
ప్రకాశం జిల్లాలో నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. గురువారం బూచేపల్లి శివ ప్రసాద్, దద్దాల నారాయణ యాదవ్, మాగుంట శ్రీని వాసుల రెడ్డి నామినేషన్లు వేశారు. ఇందులో కనిగిరి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నామినేషన్ అఫిడవిట్లో తనపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన పేరిట రూ.70.33 లక్షలు, తన భార్య మంజు భార్గవి పేరిట రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.
తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 2020లో జేసీ ప్రభాకర్ ఇంట్లోకి చొరబడిన ఘటనలో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు కాగా ఒక ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 5 కేసులు ఉన్నాయి. కాగా ఇతని పేరిట రూ.76 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు, రూ. 2.46 కోట్ల అప్పులు ఉన్నాయని సమాచారం. అయితే పెద్దారెడ్డి భార్య పేరిట రూ. 1.49 కోట్ల చరాస్తులు, రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా తవణంపల్లె(M) ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు రమాదేవి సొంత గూటికి చేరారు. పూతలపట్టు టికెట్టు ఆశించి భంగపడ్డ ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు. శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ ఛైర్‌పర్సన్ శైలజ చరణ్ రెడ్డి, వైసీపీ ఐరాల మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి, ZPTC సుచిత్ర రమాదేవితో చర్చలు జరిపారు. దీంతో ఆమె తిరిగి వైసీపీకి మద్దతు పలికారు.
Sorry, no posts matched your criteria.