Andhra Pradesh

News April 19, 2024

వెంకటగిరిపై టీడీపీలో తర్జనభర్జన

image

వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలో ఆపార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశించారు. అధిష్ఠానం మాత్రం ఆయన కుమార్తె లక్ష్మీసాయి ప్రియ వైపు మొగ్గుచూపింది. కానీ రామకృష్ణకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఉండటంతో తిరిగి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలనే యోచనతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 19, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖలోని ద్వారం వారి వీధికి చెందిన బర్రే మధవ్ (20), అనకాపల్లికి చెందిన లాలం సతీశ్ (20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. గండేపల్లి మ. రామేశంపేటలో గది అద్దెకి తీసుకొని ఉంటున్నారు. ముగ్గురు గురువారం రాత్రి పెద్దాపురానికి బైక్‌పై వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 19, 2024

ప.గో.: నామినేషన్లు START.. ఖరారవ్వని కూటమి అభ్యర్థి

image

నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైనప్పటికీ ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకుండా ఉంది. ఓ వైపు నియోజకవర్గంలోని ఆకివీడులో మంతెన రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ RRR ఈ నెల 22న నామినేషన్ వేస్తానని.. ఏస్థానం నుంచి అనేది తర్వాతనే చెబుతానని ఇటీవల ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు తమ నాయకుడికి టికెట్ వస్తుందో లేదోనన్న సంశయంలో ఉన్నారు.
– మీ కామెంట్..?

News April 19, 2024

పెందుర్తి: ఏసీబీకి చిక్కిన పంచాయతీ అధికారులు

image

విశాఖపట్నం పెందుర్తిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెందుర్తి పంచాయతీ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ వి. సత్యనారాయణ, అసిస్టెంట్ పవన్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఇంటి ప్లాన్ అనుమతి కొరకు నిందితులు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

News April 19, 2024

కాకినాడలో ACCIDENT.. బీటెక్ విద్యార్థులు మృతి

image

కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన << 13079053>>రోడ్డుప్రమాదంలో <<>>ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓకళాశాలలో విశాఖపట్నంకు చెందిన మాధవ్(20), అనకాపల్లికి చెందిన సతీష్(20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. రామేశంపేటలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పనినిమిత్తం పెద్దాపురం వెళ్లి తిరిగొస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. మాధవ్, సతీష్ అక్కడికక్కడే మృతిచెందారు.

News April 19, 2024

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న కేసులు ఇవే

image

అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుపార్టీల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వర్ల కుమార్ రాజాపై 10 కేసులు, అప్పులు రూ.29 లక్షలు. నల్లగట్ల స్వామిదాసుపై కేసులు లేవు, అప్పులు రూ.17.50 లక్షలు. యార్లగడ్డ వెంకట్రావుకు వివిధ అభియోగాల కింద 9 కేసులు, స్థిర, చరాస్తులు రూ.157.850 కోట్లు ఉన్నాయి.

News April 19, 2024

కణేకల్లు మండలంలో చంద్రబాబు సభ

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలికాఫ్టర్లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్ సెంటర్ కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

News April 19, 2024

2024 ఎలక్షన్.. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం రౌండప్

image

➤నియోజకవర్గం పేరు: పాణ్యం
➤పోలింగ్ బూత్ల సంఖ్య: 340
➤మొత్తం ఓటర్లు: 322494
➤పురుషులు: 1571130
➤మహిళలు : 165306
➤ఇతరులు: 75
➤రిటర్నింగ్ అధికారి: జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024

News April 19, 2024

VZM: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మృతి

image

ఎల్.కోటలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రాజు అనే వ్యక్తి పై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజు పోలీసులు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు రాజు సోంపురం సమీపంలో గల ఓ పొలంలో గురువారం శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి రాజుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.

News April 19, 2024

వేమిరెడ్డి దంపతుల ఆస్తులు రూ.715 కోట్లు

image

టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు. ఈక్రమంలో తమ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. ఇందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లని చెప్పారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రశాంతిపై ఎలాంటి కేసులు లేవు.