India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤నియోజకవర్గం పేరు: కోడుమూరు
➤పోలింగ్ బూత్ల సంఖ్య: 275
➤మొత్తం ఓటర్లు: 219639
➤పురుషులు: 109673
➤మహిళలు : 109943
➤ఇతరులు: 23
➤రిటర్నింగ్ అధికారి :
➤కర్నూలు రెవిన్యూ డివిజనల్ అధికారి శేషి రెడ్డి
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పదో సారి ఎమ్మెల్యే బరిలో ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అయ్యన్న తన ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్ల జంక్షన్, కృష్ణా బజారు, అబీద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం చేరుకొని అక్కడ నామినేషన్ వేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయాలని వారు కోరారు.
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .
పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈనెల19న చేపట్టే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య బుధవారం ఆదోనిలో తెలిపారు. ఆలూరు నుంచి ఆదోని మీదుగా ఆలూరు రోడ్డులో కల్లుబావి వద్ద శ్రీలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో మధ్యాహ్నం బస చేసి సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ రోడ్డు గుండా యాత్ర సాగుతుందన్నారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నలుగురు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి అసెంబ్లీకి నలుగురు, ONG, కొండపి, గిద్దలూరు, కనిగిరి, SNపాడు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైపాలెం, MRKP అసెంబ్లీకి నామినేషన్ దాఖలు కాలేదు.
సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.
చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిస్వాస్ నియమిస్తూ ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు దూకే బిస్వాస్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిశారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.
Sorry, no posts matched your criteria.