India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
విజయవాడ నగర పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 133 మందికి న్యాయస్థానం గురువారం జరిమానా విధించింది. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 133 మందికి రూ.10వేల చొప్పున మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తులు లెనిన్ బాబు, సురేశ్ బాబులు జరిమానా విధించారని పోలీస్ కమీషనరేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.
సీఎం జగన్ తనకు తీరని అన్యాయం చేశాడని తిరుపతి పార్లమెంటు బిజెపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను.. ఎవరో మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తాను బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.
నెల్లూరు జిల్లాలో తొలి రోజు 8 నియోజకవర్గాల్లో 9 మంది 14 నామినేషన్లు, నెల్లూరు పార్లమెంట్‌కు ఒక నామినేషన్ వేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులు ఇప్పటికే జిల్లాకు వచ్చారన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు 24న జిల్లాకు వస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1.78 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బస్తిపాడు నాగరాజు, కె.జయసుధ, స్వతంత్ర అభ్యర్థిగా బీచుపల్లి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా కర్నూలు నుంచి ఖలీల్ అహ్మద్ సత్తార్(SDPI), అబ్దుల్ సత్తార్(అన్నా వైసీపీ). కోడుమూరు నుంచి దస్తగిరి(TDP), ఆదిమూలపు సతీశ్(YCP). ఎమ్మిగనూరు బుట్టారేణుక(YCP), టీడీపీ నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, బైరెడ్డి నిత్యాదేవి. ఆదోని అసియా బాను(బీఎస్పీ) నామినేషన్ వేశారు.
ఒంగోలులో ATM కేంద్రాలకు నగదు తరలించే వాహనంలో రూ.65 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సీఎంఎస్ ఏజెన్సీకి సంబంధించిన వాహన సిబ్బంది భోజనం కోసం కర్నూలు రోడ్డులో వాహనాన్ని నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇచ్ఛాపురం స్వతంత్ర అభ్యర్థిగా జె.సూర్య వరప్రసాదరావు, టెక్కలి స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్, ఆమదాలవలస స్వతంత్ర అభ్యర్థులుగా జగదీశ్వరరావు, వెంకట రాజశేఖర్, ఎచ్చెర్ల స్వతంత్ర అభ్యర్థులుగా నేతల ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు. కాగా.. ప్రధాన పార్టీల నుంచి ఏ ఒక్కరూ తొలిరోజు నామినేషన్ దాఖలు చెయ్యలేదు.
Sorry, no posts matched your criteria.