India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారి మలోలకు గురువారం నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో 2014, 19 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డి పోటీ చేశారు. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
కాకినాడ జిల్లా పెద్దాపురం- రాజమండ్రి ఏడీబీ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కాకినాడకు చెందిన వారిగా తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు గురువారం ఎటువంటి నామినేషన్లు రాలేదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సమూన్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కోసం ఎవరు దాఖలాలు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
చిత్తూరు పార్లమెంటు స్థానానికి గురువారం ఒక నామినేషన్ దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పుంగనూరు అసెంబ్లీ స్థానానికి నాలుగు, నగరిలో ఒకటి, జీడీ నెల్లూరులో రెండు, చిత్తూరులో రెండు, పలమనేరులో రెండు నామినేషన్లు దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కుప్పం, పూతలపట్టు అసెంబ్లీ స్థానాలకు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.
జిల్లాలో తొలి రోజు 05 నామినేషన్లు దాఖలయ్యాయి. గన్నవరం అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ 2 సెట్లు, ఆయన సతీమణి జ్ఞానేశ్వరి ఒక సెట్, పామర్రు అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం అసెంబ్లీకి పిరమిడ్ పార్టీ నుంచి వక్కలగడ్డ పావని ఒక సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. బందరు MP, అవనిగడ్డ, పెడన, పెనమలూరు, గుడివాడ MLA స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలవ్వలేదు.
ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులతో కలిసి సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురువారం అసెంబ్లీ స్థానానికి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున నరసరావుపేట-చదలవాడ అరవిందబాబు, మంగళగిరి- నారా లోకేశ్ ఉన్నారు. వైసీపీ తరఫున బాపట్ల- కోన రఘుపతి ఉన్నారు. పిరమిడ్ పార్టీ వినుకొండ-రమణ, పెదకూరపాడు-మల్లిఖార్జున రావు, కాంగ్రెస్ తరఫున-నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ నరసరావుపేట-గోదా రమేశ్, టీడీపీ నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొడ్డు క్రాంతి కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈమేరకు కలెక్టర్ ఆ పత్రాలను పరిశీలించి ఆఫిడవిట్ అందజేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లాజిస్టిక్స్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కాల వ్యవధి తో నిర్వహించే ఈ కోర్సులో ప్రవేశాలకు జూన్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలించి జూన్ 20న ప్రవేశాలు కల్పిస్తారు. రక్షణ రంగాల్లో పనిచేసే వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రవేశాల ప్రాధాన్యత ఇస్తారు. కోర్సు ఫీజుగా ఏడాదికి రూ.60 వేలు చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.