India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌లకు మెుదటి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ వేసిన అభ్యర్థిగా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నిలిచారు.
టెక్కలి ఎమ్మెల్యేగా జడ్పీటీసీ దువ్వాడ వాణీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న ఆమె నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్న ఆమె టెక్కలి వైసీపీ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేయనుండగా.. ఆయన భార్య కూడా బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున నేపథ్యంలో టెక్కలిలో రాజకీయం ఆసక్తిగా మారింది.
కోవూరు MLA అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తొమ్మిదో సారి నామినేషన్ దాఖలు చేశారు. 1993 ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక్క 2004లో మాత్రం ఓడారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోగా 2019లో విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో దిగారు.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్(TTC) 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 1 నుంచి జూన్ 11 వరకు శిక్షణ జరుగుతుంది. ఈనెల 25వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో కోరారు. అర్హత, ఇతర వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
బద్వేలులో భారీ మొత్తంలో బంగారు, వెండి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గోపవరం మండలం, పి.పి కుంట చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల విలువచేసే గోల్డ్ & సిల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి కడపకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇవి సీక్వెల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో బండారు కిన్నెర శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యుడు అలం నరసానాయుడు పాల్గొన్నారు.
తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తు బిల్డింగు పై నుంచి కిందపడి షేక్ అసిన్(35) మృతి చెందినట్లు ఎస్సై కే సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని భీమోలు గ్రామంలో ఉదయం10 గంటలకు దాబాపై తాపీ పని చేస్తుండగా దురదృష్టవశాత్తు పై నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో గోపాలపురం ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. ఎంపీకి పోటి చేసే జనరల్ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.
ప్రజాశాంతి పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా, గాజువాక శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం తన మద్దతుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జునకు తన నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. ఒకే జిల్లా నుంచి పార్లమెంటుకు, శాసనసభకు రెండు స్థానాలకు కేఏ పాల్ పోటీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.